భోజనం తర్వాత ఇవి తింటే బరువు తగ్గొచ్చు!

మెటబాలిజం పెరిగి..
భోజనం చేసిన తర్వాత కొన్ని పదార్థాలు తీసుకోవడం ద్వారా క్యాలరీలు త్వరగా కరిగి మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా.
సోంపు
భోజనం తర్వాత సోంపు, జీలకర్ర కలిపి కొద్దిగా తీసుకుంటే డైజెషన్ బెటర్‌‌గా అవ్వడమే కాకుండా పేగులకు శోషణ శక్తి కూడా పెరుగుతుందట. తద్వారా మెటబాలిక్ రేట్ పెంచుకోవచ్చు.
వాము వాటర్
తిన్న తర్వాత వాము నానబెట్టిన నీళ్లు తాగడం ద్వారా బ్లోటింగ్ వంటి సమస్యలు తగ్గి అరుగుదల వేగవంతం అవుతుంది. తద్వారా బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
మజ్జిగ
తిన్న తర్వాత మజ్జిగ లేదా పెరుగు తీసుకోవడం ద్వారా పేగుల్లో ప్రొబాక్టీరియా పెరుగుతుంది. అది జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఈ అలవాటు ద్వారా మెటబాలిజం కూడా పెరుగుతుంది.
బెర్రీలు
భోజనం చేశాక బెర్రీ పండ్లు తినడం ద్వారా మెటబాలిజం పెరుగుతుందని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. వీటిలో ఉండే ఎసిడిక్ నేచర్ జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది.
అల్లం
తిన్న తర్వాత అల్లం లేదా మిరియాల వంటి వేడిని పెంచే పదార్థాలు కొద్దిమొత్తంలో తీసుకుంటే శరీర టెంపరేచర్ పెరిగి తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. తద్వారా మెటబాలిక్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
గ్రీన్ టీ
తిన్న తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరగడం మొదలవుతుందని కొన్ని స్టడీల్లో తేలింది. ఇక వీటితో పాటు తమలపాకు, ఆకుకూరల సలాడ్, ఖర్జూరం వంటివి కూడా తిన్న తర్వాత తీసుకోవచ్చు.