Telugu Global
Health & Life Style

నొప్పులతో వాకింగ్ చేయొచ్చా? డాక్టర్ల సలహా ఏంటంటే..

చాలామందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు నొప్పుల కారణంగా రొజువారీ వ్యాయామానికి దూరమవుతుంటారు.

నొప్పులతో వాకింగ్ చేయొచ్చా? డాక్టర్ల సలహా ఏంటంటే..
X

చాలామందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు నొప్పుల కారణంగా రొజువారీ వ్యాయామానికి దూరమవుతుంటారు. అలాగని వ్యాయామం చేయకుండా ఉంటే నొప్పులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

నొప్పుల సమస్య ఉన్నవాళ్లు కూడా తప్పక వ్యాయామం చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. అయితే నొప్పి రకాన్ని బట్టి వ్యాయామాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎటువంటి నొప్పి ఉన్నవారైనా వాకింగ్, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయొచ్చు. నడుము నొప్పి, భుజాల నొప్పులు ఉన్నవాళ్లు బరువులు ఎత్తడం, ముందుకి వంగి చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు వేగంగా కదిలే వ్యాయామాలకు బదులు స్ట్రెచింగ్ వంటివి ఎంచుకోవాలి. మెడ నొప్పి ఉన్నవాళ్లు మెడను ముందుకి వంచే వ్యాయామాలు, బరువులు ఎత్తే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

ఏయే వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి ఎక్కువ అవుతుందో గమనించి వాటికి దూరంగా ఉండడం మరో టెక్నిక్. అలాగే నొప్పిని బట్టి నడుముని నిటారుగా ఉంచడం, మెడకు బెల్ట్ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలతో కూడా వ్యాయామం చేసుకోవచ్చు.

అన్నింటికంటే ముఖ్యంగా నొప్పులతో బాధపడేవాళ్లు మైక్రో యోగా, స్ట్రెచింగ్, వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవడం మంచిది. అలాగే డాక్టర్ సలహా మేరకు కూడా వ్యాయామాలను ఎంచుకోవచ్చు. అయితే నొప్పుల కారణంగా వ్యాయామానికి దూరంగా ఉండడం వల్ల నొప్పుల సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదో ఒక విధంగా ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉంటే ప్రయత్నం చేయాలి.

వీటితోపాటు సమయానికి మందులు వాడడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఫిజియోథెరపీ వంటివి చేయించుకోవడం ద్వారా నొప్పులు మరింత త్వరగా తగ్గే వీలుంటుంది. నొప్పులు వేధించే వాళ్లు విటమిన్ల లోపం లేకుండా అన్ని పోషకాలు అందేలా సమతుల ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే.

First Published:  19 Jan 2024 4:30 AM GMT
Next Story