Telugu Global
Cinema & Entertainment

ఈవారం సినిమాలు.. అందరి చూపు ఒకే సినిమాపై

ఈ వీకెండ్ 5 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే అందరి చూపు ఒకే ఒక్క సినిమాపై ఉంది. ఆ మూవీ ఏంటి?

ఈవారం సినిమాలు.. అందరి చూపు ఒకే సినిమాపై
X

ఈవారం సినిమాల హంగామా ఆల్రెడీ మొదలైంది. ఈరోజు 'నేనే వస్తున్నా' అనే సినిమా రిలీజైంది. ధనుష్ హీరోగా నటించిన సినిమా ఇది. పైగా గీతాఆర్ట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేయడంతో సినిమాపై కాస్త క్రేజ్ పెరిగింది. ఈ సినిమాతో పాటు రేపట్నుంచి మరికొన్ని సినిమాల హంగామా మొదలుకాబోతోంది.

మణిరత్నం దర్శకత్ వహించిన పొన్నియన్ సెల్వన్-1 సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దాదాపు ఐదేళ్లుగా నలుగుతున్న మణిరత్నం కలల ప్రాజెక్టు ఇది. తమిళ్ లో పెద్ద హిట్టయిన నవల ఆధారంగా, చోళ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. కార్తి, విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ లాంటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించాడు.

పీఎస్-1తో పాటు.. నేను కేరాఫ్ నువ్వు, లాట్స్ ఆఫ్ లవ్, బలమెవ్వడు అనే మరో 3 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ వేటికవే చిన్న సినిమాలు. కేవలం ఇందులో ఉన్న కంటెంట్ తో ఇది గట్టెక్కాల్సి ఉంటుంది తప్ప, ఎలాంటి స్టార్ కాస్ట్ లేని సినిమాలివి. వీటిలో బలమెవ్వడు సినిమా అక్టోబర్ 1న థియేటర్లలోకి వస్తోంది. మిగతా సినిమాలన్నీ రేపే (30న) రిలీజ్ అవుతున్నాయి.

ఇలా ఈ వీకెండ్ 5 సినిమాలున్నప్పటికీ.. అందరి చూపు పొన్నియన్ సెల్వన్ సినిమాపైనే ఉంది. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

First Published:  29 Sep 2022 11:45 AM GMT
Next Story