రామప్ప ఆలయంలో మల్లికా సారాభాయి ప్రదర్శనకు కిషన్ రెడ్డి అనుమతి నిరాకరించడం వెనక అసలు కారణమేంటి ?

బీజేపీతో తనకున్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలే అనుమతి నిరాకరణ వెనుక ఉన్నాయని మల్లికా సారాభాయ్ అన్నారు. “నేను ‘శివశక్తి’ రూపకం ప్రదర్శించాలనుకున్నాను. కానీ హిందూత్వ, బీజేపీతో నాకున్న వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంగా నాకు అనుమతి ఇవ్వలేదు.అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2023-01-22 02:34 GMT

ప్రముఖ నృత్యకారిణి, ‘శివశక్తి’ రూపకం ప్రదర్శనలో పేరెన్నికగల మల్లికా సారాభాయి కి రామప్ప గుడిలో నృత్య ప్రదర్శనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (KHT) ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది.

నృత్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత ప్రభుత్వ సంస్థ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి మూడు నెలల క్రితం దరఖాస్తు చేసిది KHT.

అయితే ఆమె నృత్య ప్రదర్శనకు అనుమతి నిరాకరించడం వెనక భావజాలపరమైన కారణాలున్నాయని, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తో పాటు సారాభాయి కూడా ఆరోపించారు.

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ బివి పాపారావు మాట్లాడుతూ బిజెపితో సైద్ధాంతిక విభేదాల కారణంగా ములుగు జిల్లా రామప్ప ఆలయంలో మల్లికా సారాభాయి నృత్య కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అనుమతి నిరాకరించారు. దాంతో మేము వేదికను హన్మకొండలోని KUDA మైదానానికి మార్చాము." అని చెప్పాడు.

బీజేపీతో తనకున్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలే అనుమతి నిరాకరణ వెనుక ఉన్నాయని మల్లికా సారాభాయ్ అన్నారు. “నేను ‘శివశక్తి’ రూపకం ప్రదర్శించాలనుకున్నాను. కానీ హిందూత్వ, బీజేపీతో నాకున్న వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంగా నాకు అనుమతి ఇవ్వలేదు. ఇది దురదృష్టకరం. మన‌ము ప్రశ్నించడానికి అనుమతించని వాతావరణంలో జీవిస్తున్నాము ”అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సారాభాయి నృత్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత ప్రభుత్వ సంస్థ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి మూడు నెలల క్రితం దరఖాస్తు చేశామని పాపారావు చెప్పారు.

"కానీ అనుమతి ఇవ్వలేదు. మల్లికా సారాభాయి ప్రదర్శన కాబట్టే అనుమతి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మౌఖికంగా చెప్పారు. ఇది దురదృష్టకరం, ”అని పాపారావు అన్నారు.

తమ భావజాలాన్ని వ్యతిరేకించేవాళ్ళెవరూ దేశంలో ఏ పనులూ చేయకుడదనే ఆలోచనలు నియంత్రుత్వానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. కళాకారులు, కవులు, రచయితలు, మేదావులను అణిచివేయాలనుకోవడం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News