TSPSC కొత్త షెడ్యూల్.. ఈ తేదీలు గుర్తుంచుకోండి

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లో జరగాల్సిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్ట్ లకు పరీక్షల షెడ్యూల్ ని అధికారులు విడుదల చేశారు.

Advertisement
Update: 2023-04-15 16:32 GMT

TSPSC పోటీ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత జరగాల్సిన కొన్ని పరీక్షలను TSPSC నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షలకు ఇప్పుడు కొత్త తేదీలను ప్రకటించారు అధికారులు. ఈసారి పగడ్బందీ ఏర్పాట్లతో సమాయత్తమయ్యారు.

ఏ పరీక్ష ఎప్పుడంటే..?

TSPSC ఆధ్వర్యంలో జరగాల్సిన ఐదు పోటీ పరీక్షలకు కొత్తగా షెడ్యూల్ ప్రకటించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లో జరగాల్సిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్ట్ లకు పరీక్షల షెడ్యూల్ ని అధికారులు విడుదల చేశారు.





ఈ నెల 23న జరగాల్సిన అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ పరీక్ష జూన్‌ 28న జరుగుతుంది.

ఈ నెల 25న జరగాల్సిన అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష జూన్‌ 16న జరుగుతుంది.

మే 7న జరగాల్సిన డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్‌ రాత పరీక్ష మే 19న నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 26, 27 తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌ మెంట్‌ గెజిటెడ్‌ కేటగిరీ పరీక్షలు జులై 18, 19న జరుగుతాయి.

అదే విభాగంలో నాన్‌ గెజిటెడ్‌ కేటగిరీ పరీక్షలు జులై 20, 21కి రీ షెడ్యూల్ అయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News