రాజాసింగ్ మళ్ళీ అరెస్ట్!

గతంలో నమోదైన కేసుల్లో రాజా సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళ్ హాట్, షాయినాయత్ గంజ్ పోలీసులు కొద్ది సేపటి క్రితం ఆయనను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు.

Advertisement
Update: 2022-08-25 10:26 GMT

ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. మంగళ్ హాట్, షాయినాయత్ గంజ్ పోలీసులు కొద్ది సేపటి క్రితం ఆయనను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు.

గ‌తంలో రాజా సింగ్‌పై న‌మోదైన  కేసుల విష‌యంలో ఆయ‌న‌కు గురువారం ఉద‌యం మంగ‌ళ్‌హాట్, షాహినాయ‌త్ గంజ్‌ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా 6 నెల‌ల క్రితం న‌మోదైన కేసుల విష‌యంలో ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని పోలీసుల‌ను రాజా సింగ్ అడ్డుకున్నారు. అయితే తాము నిబంధ‌న‌ల మేర‌కే న‌డుచుకుంటున్నామని, త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు రాజా సింగ్‌ను కోరారు.

అనంతరం రాజాసింగ్ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను చెర్లపల్లి జైలుకు తరలించారు.

2004 నుండి ఆయనపై 101 కేసులు ఉన్నాయి. ఇందులో 18 మతపరమైన కేసులు. దాంతో ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.

కాగా, హైదరాబాద్ లో స్టాండ‌ప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ కామెడీ షో జరిగిన నాటి నుంచి వివాదం ముదురుతోంది. ఆయన షోను ఆపకపోతే దాడులు చేస్తామని హెచ్చరించిన రాజాసింగ్, షో విజయవంతంగా జరగడంతో వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ముస్లింల ఆగ్రహానికి కారణమయ్యారు. దాంతో రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయనను అరెస్టు చేసిన పద్దతి సరిగ్గా లేదంటూ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మరోవైపు రాజాసింగ్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో బీజేపీ ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడమే కాక సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

Tags:    
Advertisement

Similar News