నిప్పు లేకుండా పొగ వస్తుందా..? ఈటల ట్వీట్ పై సెటైర్లు

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటలకు ప్రత్యేక వర్గమేమీ లేదు. అప్పటికే బీజేపీలో ఉన్న నేతలు కూడా ఆయనతో కలవడంలేదు.

Advertisement
Update: 2023-05-18 08:14 GMT

నేను పార్టీ మారట్లేదొహో అని డప్పు కొట్టుకుంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. అసలింతకీ సడన్ గా ఈటల ఇంత వివరణ ఎందుకివ్వాల్సి వచ్చింది. అసలు బీజేపీలో ఏం జరుగుతోంది..? ఈటల ఎందుకు పార్టీ మారాల్సి వస్తోంది..? అసలా వార్తలు ఎలా పుట్టాయి.

ఈటల పార్టీ మారడం, మారకపోవడం తర్వాతి విషయం. ఒక నాయకుడిపై పార్టీ మార్పు వార్తలు రావడం, వాటికి ఆయన వివరణ ఇవ్వడం సహజంగా జరిగేదే. అయితే అలా వివరణ ఇచ్చినవారెవరూ పాత పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేరు, వెంటనే జెండా మార్చేస్తారు. మరిప్పుడు ఈటల ఇచ్చి వివరణ కూడా అలాంటిదేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.


ఈటల రాజేందర్ కు తెలంగాణ బీజేపీలో పెద్ద ప్రాధాన్యత లేదనే విషయం తెలిసిందే. పార్టీ అంతా బండి సంజయ్ చెప్పు చేతల్లోనే ఉంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటలకు ప్రత్యేక వర్గమేమీ లేదు. అప్పటికే బీజేపీలో ఉన్న నేతలు కూడా ఆయనతో కలవడంలేదు. మాజీ మంత్రి అనే స్థాయి మర్యాదలేవీ అక్కడ జరగడంలేదు. చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా పెద్దగా ప్రయోజనం లేదని ఈటలకు తెలిసిపోయింది. అటు కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ఈటలలో ఆలోచన మొదలైందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఆయన పార్టీ మారతారనే వార్తలు కూడా రావడంతో.. ఈటల వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి నిజంగానే ఈటల మనసులో ఏమీ లేదా, లేక నర్మగర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. పార్టీ మారే అలవాటు తనకు లేదు అని ట్వీట్లు వేసిన ఈటలకు నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు. గతం అప్పుడే మరచిపోయావా ఈటలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద.. పార్టీ మార్పు వార్తలకు వివరణ ఇచ్చుకునేందుకు ఈటల వేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News