భారతదేశ వైవిధ్యాన్ని గౌరవించాలి - కేటీఆర్

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను ఇటీవల సందర్శించిన అనుభవాలను పంచుకున్న కేటీఆర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని గ్రహించి, నెమ్మదిగా చైనా నుండి వైదొలగడం ప్రారంభించాయని, దీన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.

Advertisement
Update: 2023-01-28 08:30 GMT

ప్రజాస్వామ్యం భారతదేశ ఆస్తి అని పేర్కొన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి ఒక్కరం దేశ వైవిధ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

నిజామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ''1980లలో చైనా, భారతదేశం దాదాపు ఒకే విధమైన GDPలను కలిగి ఉన్నాయి. చైనా ఇప్పుడు 16 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది భారతదేశం ఇప్పటికీ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనా ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి సారించడం, భారతదేశం రాజకీయాలపై దృష్టి పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది'' అని ఆయన అన్నారు.

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను ఇటీవల సందర్శించిన అనుభవాలను పంచుకున్న కేటీఆర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని గ్రహించి, నెమ్మదిగా చైనా నుండి వైదొలగడం ప్రారంభించాయని అన్నారు.

దీన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలి. తయారీ, సేవలు, ఇతర రంగాలలో భారతదేశం మరింత వైవిధ్యభరితంగా ఉండాలి. భారతదేశానికి యువ ఆలోచనా శక్తి అనే గొప్ప ఆస్తి ఉందని ఆయన వివరించారు.

"ఆవిష్కర్తలకు వారి జెండర్, వయస్సు, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా సమానమైన అవకాశాలు కల్పించినప్పుడే భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకరాగలుగుతాం " అని కేటీఆర్ అన్నారు.

మహిళా నేతల పదోన్నతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా చొరవ చూపుతోందని చెప్పిన కేసీఆర్ ఇప్పటికే గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో 50 శాతం మహిళకే ప్రాతినిధ్యం ఇస్తున్నామన్నారు.

పార్లమెంట్‌లో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆరెస్ డిమాండ్ చేసిందని, దానిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News