నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమొరీస్ -జగ్గారెడ్డి

గాంధీ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే తాను కాంగ్రెస్‌ లో కొనసాగుతున్నానని చెప్పారు జగ్గారెడ్డి. తాను ఏ పార్టీలోకీ వెళ్లనని, సొంత పార్టీ కూడా పెట్టబోనని, అసలా ఆలోచనే తనకు లేదన్నారు.

Advertisement
Update: 2023-04-27 11:38 GMT

నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ -జగ్గారెడ్డి

గతమెంతో ఘనం అంటూ నిట్టూర్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆరోజులే బాగున్నాయంటూ తన నియోజకవర్గ కార్యకర్తలకు ఓ లేఖ రాశారు. అప్పట్లో గాంధీ భవన్ రాజకీయాలు ఎలా ఉండేవో తన లేఖలో గుర్తు చేసుకున్నారు. గాంధీభవన్ లో ఇప్పుడు ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయాయని అన్నారు. అయితే ఇందుకు కారణం ఎవరనేది తాను చెప్పనన్నారు. ఈ విషయం మీడియాకి చెప్పడానికి కూడా ఓ కారణం ఉందన్నారాయన. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఓటర్లకు సమాచారం ఉండాలనే ఉద్దేశంతోనే తన ఆవేదన తెలియజేసినట్టు ప్రకటించారు జగ్గారెడ్డి.

కొంతకాలంగా జగ్గారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. సొంత పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన పెద్దగా తలదూర్చడంలేదు. ఆమధ్య పాదయాత్రలంటూ హడావిడి చేసినా సాధ్యపడలేదు. ఐదు నెలలుగా చూస్తున్నా పార్టీ వ్యవహారంలో ఎలాంటి మార్పు లేదన్నారు జగ్గారెడ్డి. అందుకే తానిప్పుడు పూర్తిగా తన నియోజకవర్గంపైనే దృష్టి పెడుతున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్ లో ఇంకా ఎందుకు ఉన్నానంటే..?

గాంధీ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే తాను కాంగ్రెస్‌ లో కొనసాగుతున్నానని చెప్పారు జగ్గారెడ్డి. తాను ఏ పార్టీలోకీ వెళ్లనని, సొంత పార్టీ కూడా పెట్టబోనని, అసలా ఆలోచనే తనకు లేదన్నారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నట్టే కాంగ్రెస్ లో కూడా ఉన్నాయని, కానీ తామంతే కలిసే ఉంటామని క్లారిటీ ఇచ్చారు జగ్గారెడ్డి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. పాతరోజుల్లో గాంధీభవన్‌ లో సీనియర్లతో కలసి మాట్లాడుకునేవారమని, అనేక విషయాలు చర్చించేవారమని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పాత రోజుల్లో లాగా గాంధీభవన్‌ లో కూర్చోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మునుపటిలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News