దశాబ్ది ఉత్సవాల్లో భారత జాగృతి సాహిత్య సభలు

జూన్ 12 ఉదయం “స్వరాష్ట్రంలో సాహితీ వికాసం” పేరుతో ప్రారంభ సమావేశం నిర్వహిస్తారు. 13వ తేదీ సాయంత్రం ముగింపు సమావేశం ఉంటుంది.

Advertisement
Update: 2023-05-27 16:20 GMT

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల్లో భారత జాగృతి సంస్థ కూడా తన ప్రత్యేకత చాటుకునేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లో రెండు రోజులపాటు భారత జాగృతి సంస్థ సాహితీ సభలను నిర్వహించబోతోంది. జూన్ 12, 13 తేదీల్లో హైదరాబాద్‌ లోని సారస్వత పరిషత్తు ప్రాంగణంలో సాహితీ సభలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

సాహితీ సభలలో.. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై రెండు రోజుల పాటు లోతైన సమాలోచనలు, పత్ర సమర్పణలు ఉంటాయి. జూన్ 12 ఉదయం “స్వరాష్ట్రంలో సాహితీ వికాసం” పేరుతో ప్రారంభ సమావేశం నిర్వహిస్తారు. ఆరు సెషన్లలో అంశాలవారీగా జరిగే ఈ సభలలో వివిధ రంగాలపై సాధికార అవగాహన కలిగి, అధ్యయనం, పరిశోధన చేసిన సాహితీవేత్తలు ప్రసంగిస్తారు. 13వ తేదీ సాయంత్రం ముగింపు సమావేశం ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జూన్ 2నుంచి దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయి, 22వ తేదీతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 21రోజులపాటు ప్రతిరోజు జరగాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే షెడ్యూల్ రెడీ అయింది. ఈ షెడ్యూల్ కి అనుబంధంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారత జాగృతి సంస్థ కూడా దశాబ్ది ఉత్సవాలలో తనదైన భూమిక నిర్వహించేందుకు సిద్ధమైంది. సాహితీ సభలతో ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రజలకు గుర్తు చేయబోతోంది. 

Tags:    
Advertisement

Similar News