మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక‌!

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బండ ప్రకాశ్ ను అభినందించారు. పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బండ ప్రకాశ్ లాంటి విద్యాధికులు డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

Advertisement
Update: 2023-02-12 07:50 GMT

ఈ రోజు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి డిప్యూటీ చైర్మన్ గా ఆయన నామినేషన్ ఒక్కటి మాత్రమే రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బండ ప్రకాశ్ ను అభినందించారు. పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బండ ప్రకాశ్ లాంటి విద్యాధికులు డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

ప్రకాశ్ విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని, అటువంటి వారు మంచి పదవులు పొందడం అవసరమన్నారు. బండ ప్రకాశ్ సేవలు తెలంగాణ ప్రజలకు చాలా అవసరమని కేసీఆర్ అన్నారు.

మండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండ ప్రకాశ్ కు మంత్రి కేటీఆర్ తో పాటు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News