ప్రపంచకప్ లో మరో సంచలనం, ఇంగ్లండ్ కు ఐర్లాండ్ షాక్!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12రౌండ్లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ప్రపంచ రెండోర్యాంకర్ ఇంగ్లండ్ కు 12వ ర్యాంక్ జట్టు ఐర్లాండ్ షాకిచ్చింది.

Advertisement
Update: 2022-10-26 12:49 GMT

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12రౌండ్లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ప్రపంచ రెండోర్యాంకర్ ఇంగ్లండ్ కు 12వ ర్యాంక్ జట్టు ఐర్లాండ్ షాకిచ్చింది. డక్ వర్త్- లూయిస్ విధానం ప్రకారం 5 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్-1 పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది...

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో పెద్దజట్లు, చిన్నజట్లూ అంటూ ఉండవని, తమదైన రోజున ర్యాంకులు, హోదాలు, రికార్డులకు అతీతంగా ఏ జట్టు ఏజట్టునైనా కంగు తినిపించగలదని ప్రపంచ 12వ ర్యాంకర్ ఐర్లాండ్ మరోసారి నిరూపించింది.

సూపర్ -12 రౌండ్ గ్రూప్-1 రెండోరౌండ్ పోరులో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో 2వ ర్యాంకర్ ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించింది.

ఇంగ్లండ్ డక్‌ ..ఐర్లాండ్ వర్త్!

మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈమ్యాచ్ తో వరుణదేవుడు పలుమార్లు దోబూచులాడాడు. వానదెబ్బతో నిర్ణితసమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైన

ఈపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటయ్యింది.

కెప్టెన్ కమ్ ఓపెనర్ యాండీ బాల్ బిర్నీ62 పరుగులు, వన్ డౌన్ బ్యాటర్ టక్కర్ 34 పరుగులతో రాణించారు. ఒక దశలో 3 వికెట్లకు 103 పరుగులతో భారీస్కోరుకు ఉరకలేసిన ఐర్లాండ్ జట్టు..చివరి 7 వికెట్లను 54 పరుగుల తేడాతో కోల్పోయింది.

కెప్టెన్ బాల్ బిర్నీ 47 బాల్స్ లో 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టక్కర్ 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో34 పరుగుల స్కోరు సాధించాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ లివింగ్ స్టోన్ 3 వికెట్లు, సీమర్ సామ్ కరెన్ 2 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లండ్ కు వానదెబ్బ....

159 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు వానదెబ్బ గట్టిగానే తగిలింది. కుండపోత వానతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 14.3 ఓవర్లలో 5 వికెట్లకు ౧౦౫ పరుగులు మాత్రమే చేయగలిగింది.

వర్షంతో మ్యాచ్ రద్దయ్యే సమయానికి ...డక్ వర్త్ -లూయిస్ విధానం ప్రకారం ఐర్లాండ్ కంటే ఇంగ్లండ్ 5 పరుగులతో వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ టాపార్డర్లో కెప్టెన్ బట్లర్ డకౌట్ కాగా..మరో ఓపెనర్ హేల్స్ 7 పరుగులకు, రెండోడౌన్ బెన్ స్టోక్స్ 6 పరుగులకు వెనుదిరిగారు. వన్ డౌన్ డేవిడ్ మలాన్ 35, మిడిలార్డర్ ఆటగాడు హారీ బ్రూక్ 18

పరుగులు సాధించగా..ఆల్ రౌండర్ మోయిన్ అలీ 12 బాల్స్ లో 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 24 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు.

ఐర్లాండ్ బౌలర్లలో జోష్ లిటిల్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో నెగ్గినట్లు అంపైర్లు ప్రకటించడంతో ప్రస్తుత ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం నమోదైనట్లయ్యింది.

న్యూజిలాండ్- అఫ్ఘన్ మ్యాచ్ వర్షార్పణం..

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగానే రన్నరప్ న్యూజిలాండ్, అఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ -1 మరో రెండోరౌండ్ మ్యాచ్ ఒక్క బంతీ పడకుండానే రద్దుల పద్దులో చేరిపోయింది.

వానదెబ్బతో మ్యాచ్ రద్దు కావడంతో రెండుజట్లూ చెరో పాయింట్ ను పంచుకోవాల్సి వచ్చింది.

గ్రూప్-1 లో మొదటి రెండురౌండ్ల పోటీలు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 పాయింట్లతో టాపర్ గా కొనసాగుతోంది. 2 పాయింట్ల చొప్పున సాధించి ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్ సంయుక్త ద్వితీయస్థానంలో కొనసాగుతున్నాయి. ఒకే ఒక్కపాయింటుతో అఫ్ఘనిస్థాన్ లీగ్ టేబుల్ అట్టడుగున నిలిచింది.

Tags:    
Advertisement

Similar News