బుమ్రాను వీడని గాయం, సిరీస్ కు దూరం!

భారత మెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను గాయం ఇప్పట్లో విడిచిపెట్టేలా లేదు. వెన్నెముక నొప్పితో శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ కు సైతం దూరమయ్యాడు.

Advertisement
Update: 2023-01-10 06:04 GMT

బుమ్రాను వీడని గాయం, సిరీస్ కు దూరం!

భారత మెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను గాయం ఇప్పట్లో విడిచిపెట్టేలా లేదు. వెన్నెముక నొప్పితో శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ కు సైతం దూరమయ్యాడు...

గాయాల నుంచి బయటపడటం అంతతేలిక కాదని భారత సూపర్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు అనుభవమయ్యింది. శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ చేయాలనుకొన్న బుమ్రాకు మరోసారి నిరాశే ఎదురయ్యింది.

దురదృష్టకరం- రోహిత్ శర్మ...

బుమ్రా పునరాగమనం మరికొంతకాలం వాయిదా పడటం దురదృష్టకరమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు గౌహతీ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బుమ్రా గాయం గురించిన వివరాలు రోహిత్ బయట పెట్టాడు.

గత ఏడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ లు పూర్తిగా ఆడకుండానే ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన బుమ్రా అప్పటి నుంచి వెన్నెముక గాయానికి చికిత్స పొందుతూ రీహేబిలేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ, సాధన చే్స్తూ వచ్చాడు.

బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ముమ్మరంగా సాధన చేస్తూ వచ్చిన బుమ్రా తిరిగి పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించినట్లుగా బీసీసీఐ వైద్యబృందం, టీమ్ ఫిజియో ప్రకటించారు. దీంతో ..శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ జట్టులో బుమ్రాకు చోటు సైతం కల్పించారు.

ఆఖరి నిముషంలో...

శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభానికి కొద్దిగంటల ముందే బుమ్రా ఫిట్ నెస్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ అధికారికంగా ప్రకటించాడు. బుమ్రా గత కొన్నివారాలుగా కఠోరసాధనతో నెట్ ప్రాక్టీసు కొనసాగించాడని..అయితే..వెన్నెముక పట్టేసినట్లుగా ఉందని చెప్పడంతో ముందుజాగ్రత్తగా పక్కన పెట్టామని, జట్టులో తిరిగి చేరాలని ఎంతో ఆశపడిన బుమ్రాను పక్కన పెట్టడం బాధకలిగిస్తోందని వివరించాడు.

జట్టు నుంచి తప్పుకోవాలన్నది బుమ్రా సొంతనిర్ణయమని, బుమ్రాను పరీక్షించిన ట్రైనర్..మరో మూడువారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారని, ప్రస్తుత వన్డే సిరీస్ తో పాటు..ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని తొలిటెస్ట్ కు దూరంగా ఉండక తప్పదని బీసీసీఐ చెబుతోంది.

వన్డే ప్రపంచకప్ తో పాటు..టెస్ట్ లీగ్ కు బుమ్రా ఎంతో కీలకమని, ముందు జాగ్రత్త చర్యగా బుమ్రాను ఒత్తిడికి దూరంగా ఉంచుతున్నట్లు భారత కెప్టెన్ తెలిపాడు.

శ్రీలంకతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జనవరి 12న కోల్ కతా, 15న తిరువనంతపురం వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి.

గత సెప్టెంబర్ నుంచి భారతజట్టుకు దూరంగా ఉంటూ వచ్చిన జస్ ప్రీత్ బుమ్రా తిరిగి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడాలంటే మరికొంత కాలం ఓర్పుతో ఎదురుచూడక తప్పదు.

బుమ్రా లేని భారత బౌలింగ్ ఎటాక్ పసలేనట్లుగా మారిందనడంలో ఎలాంటి సందేహమూలేదు.

Tags:    
Advertisement

Similar News