ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ విజేతగా బోపన్న జోడీ

భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–2024 డబుల్స్‌ విభాగంలో చరిత్ర సృష్టించాడు.

Advertisement
Update: 2024-01-27 15:09 GMT

భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–2024 డబుల్స్‌ విభాగంలో చరిత్ర సృష్టించాడు. తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్‌–వావాసోరిపై విజయం సాధించాడు. తద్వారా కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా అతి పెద్ద వయసులో కావడం గమనార్హం. అంతేకాదు.. అతి పెద్ద వయసులో అంటే 43 సంవత్సరాల వయసులో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన టెన్నిస్‌ ఆటగాడి గానూ రోహన్‌ ఘనత సాధించాడు.

రోహన్‌–ఎబ్డెన్‌ జోడీకి ఫైనల్లో సిమోన్‌ – వావాసోరి జోడీ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. తొలి పాయింట్‌ నుంచీ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెట్‌ను 7–6 (7/0)తో రోహన్‌ జోడీ గెలుపొందింది. ఇక రెండో సెట్లోనూ ఆటగాళ్లు విజయం కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు.

ఒక దశలో రోహన్‌ జోడీ 3–4తో వెనకబడినా ఆ తర్వాత పుంజుకుంది. మ్యాచ్‌ ఫలితం మూడో సెట్‌కు వెళుతుందేమో అనుకునే తరుణంలో రోహన్‌ జోడీ చివర్‌లో అదరగొట్టింది. రెండో సెట్‌ని 7–5 తేడాతో నెగ్గి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇక కేంద్ర ప్రభుత్వం రోహన్‌ బోపన్నకు ఇటీవల ’పద్మ’ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News