గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రస్టింగ్ న్యూ ఫీచర్స్

Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్తగా మూడు ఫీచర్లు రాబోతున్నాయి. చార్జింగ్ స్టేషన్లు, సెర్చ్ విత్ లైవ్ వ్యూ, యాక్సెసబుల్ లొకేషన్స్ పేరుతో రాబోతున్న ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Update: 2022-12-01 07:00 GMT

గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రస్టింగ్ న్యూ ఫీచర్స్

గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్తగా మూడు ఫీచర్లు రాబోతున్నాయి. చార్జింగ్ స్టేషన్లు, సెర్చ్ విత్ లైవ్ వ్యూ, యాక్సెసబుల్ లొకేషన్స్ పేరుతో రాబోతున్న ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ మ్యాప్స్‌లో 'సెర్చ్ విత్ లైవ్ వ్యూ' అనే కొత్త ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రత్యక్షంగా కనిపించే లొకేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా కొత్త ప్లేస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉండే షాపులు, బిల్డింగ్‌లు, రోడ్ల గురించి మనకు అంతగా తెలియకపోవచ్చు. అప్పుడు ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ పక్కన కనిపించే కెమెరా ఐకాన్‌ని టాప్‌ చేయాలి.

తెలుసుకోవాలనుకున్న షాపుని కెమెరాలో ఫోకస్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

అలాగే యాక్సెసబుల్ లొకేషన్స్ అనే మరో ఫీచర్ ద్వారా వీల్ చెయిర్ యాక్సెస్, పార్కింగ్ సౌకర్యం, రెస్ట్ రూమ్స్ లాంటి ఇతర సౌకర్యాలు ఉండే లొకేషన్స్‌ను కనిపెట్టొచ్చు.

ఇకపోతే మూడో ఫీచర్ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు. గూగుల్ మ్యాప్స్ ద్వారా 50కిలోవాట్స్‌ లేదా అంతకు మించి సామర్ధ్యం కలిగిన చార్జింగ్ స్టేషన్లను ఈజీగా వెతుక్కోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్లన్నీ యుఎస్, యుకె దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇక్కడ కూడా అందుబాటులోకి వస్తాయి.

Tags:    
Advertisement

Similar News