ఏ వీడియోనైనా ఇలా డౌన్‌లోడ్ చేయొచ్చు!

యూట్యూబ్‌, డైలీమోషన్‌, ట్విట్చ్‌, విమియో వంటి వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేయడం కోసం కొన్ని టూల్స్ వాడొచ్చు.

Advertisement
Update: 2023-03-26 03:00 GMT

ఆన్‌లైన్‌లో రకరకాల వీడియోలు చూస్తుంటాం. అయితే వాటిలో మళ్లీ చూడాలనిపించేవి, డైలీ లైఫ్‌లో ఉపయోగపడే వీడియోలు కొన్ని ఉంటాయి. వీటిని ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్‌తో పనిలేకుండా కావల్సినప్పుడు చూసుకోవచ్చు. యూట్యూబ్‌, డైలీమోషన్‌, ట్విట్చ్‌, విమియో వంటి వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేయడం కోసం కొన్ని టూల్స్ వాడొచ్చు.

‘యూట్యూబ్ వీడియోలను ఫోన్ లేదా ల్యాప్‌టాప్ స్టోరేజీలో సేవ్ చేసుకోవడం ఎలా?’ అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. దీనికోసం ముందుగా వీడియో లింక్‌ను కాపీ చేయాలి. మొబైల్‌లో యూట్యూబ్ వీడియో కింద షేర్ బటన్ నొక్కితే లింక్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేయాలి. తర్వాత క్రోమ్‌లో ‘సేవ్ ఫ్రమ్ నెట్(savefrom.net)’ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సైట్ ఓపెన్ చేయగానే లింక్ పేస్ట్ చేయమని అడుగుతుంది. వీడియో లింక్‌ పేస్ట్ చేస్తే రకరకాల ఫార్మాట్లు చూపిస్తుంది. నచ్చిన ఆడియో/వీడియో ఫార్మాట్లలో వీడియో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ , ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఏ ప్లాట్‌ఫామ్‌లోని వీడియోనైనా ఈ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

‘ఫ్రీమేక్‌ వీడియో డౌన్‌లోడర్‌’ అనే మరో టూల్‌ను ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా నచ్చిన ఫార్మాట్‌లో వీడియో/ఆడియోలను డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ టూల్ విండోస్‌, మ్యాక్‌ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది.

‘వీడియో కీపర్’ అనే మరో యాప్ ద్వారా మొబైల్‌లో ప్లే అయ్యే రకరకాల వీడియోలను ఫోన్ స్టోరేజ్‌లో సింపుల్‌గా సేవ్ చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News