జాతీయ జెండాలో ఆ రంగు తీసేస్తారా..?

రాష్ట్రపతి ప్రసంగంలో ముస్లింల గురించి ఒక్క మాట కూడా లేదని, మైనార్టీల పథకాలకు బడ్జెట్‌ లో నిధులు తగ్గించారని అన్నారు అసదుద్దీన్. ఆకుపచ్చ రంగు అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకంత అసహనం..? అని ప్రశ్నించారు.

Advertisement
Update: 2023-02-08 09:21 GMT

జాతీయ జెండాలో ఆ రంగు తీసేస్తారా..?

జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగుని కేంద్రం తీసేస్తుందా..? అని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లింలకు అన్యాయం చేశారని పార్లమెంట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్ పై జరిగిన చర్చలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో ముస్లింల గురించి ఒక్క మాట కూడా లేదని, మైనార్టీల పథకాలకు బడ్జెట్‌ లో నిధులు తగ్గించారని అన్నారు అసదుద్దీన్. ఆకుపచ్చ రంగు అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకంత అసహనం..? అని ప్రశ్నించారు.


జాతీయ జెండాలో ఆకుపచ్చరంగును తీసేస్తారా..? అంటూ సంచలన వ్యాఖ్యల చేశారు. మీ నారీశక్తి నినాదం బిల్కిస్‌ బానో విషయంలో ఏమైంది..? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు అసదుద్దీన్.

పార్లమెంట్ లో ఈ రోజుకూడా అదానీ వ్యవహారంపై రచ్చ జరిగింది. కాంగ్రెస్‌ నేతలు హిండెన్‌ బర్గ్‌ నివేదిక గురించి ప్రస్తావించగా.. బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌, బోఫోర్స్‌ అంశాన్ని లేవనెత్తారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పీయూష్‌ గోయల్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది.


ఖర్గే ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. ఖర్గే కూడా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను నిజం మాట్లాడితే అది దేశ వ్యతిరేకమా..? అని ప్రశ్నించారు. “నేను దేశ వ్యతిరేకిని కాదు.


ఇక్కడ అందరికంటే నాకు దేశభక్తి ఎక్కువ. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు. నేను దేశ వ్యతిరేకిని అని చెబుతున్నారు.” అంటూ మండిపడ్డారు ఖర్గే.

Tags:    
Advertisement

Similar News