'నిజమైన రంగులు ఎప్పటికీ వెలిసిపోవు'... కవితపై ఢిల్లీలో ఫ్లెక్సీలు

కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆరెస్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. మరి కొద్ది సేపట్లో కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరనుండగా, ఇప్పటికే ఆమె బస చేసిన కేసీఆర్ ఇంటికి వందలాది మంది బీఆరెస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు.

Advertisement
Update: 2023-03-11 03:49 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను ఈ రోజు ఈడీ విచారణ చేయనుంది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు , పోస్టర్లు వెలిశాయి. స్కాంలు చేసిన వారు బీజేపీలో చేరగానే కేసులు లేకుండా చేస్తారని, బీజేపీ లో చేరకపోతే, ఆ పార్టీని వ్యతిరేకిస్తే ఏ తప్పూ చేయకపోయినా అక్రమ కేసులు పెడతారు. అనే అర్దం వచ్చే రీతిలో ఫ్లెక్సీల్లో మ్యాటర్ ఉంది.

'నిజమైన రంగులు ఎప్పటికీ వెలిసిపోవు'' బైబై మోడీ అనే టెక్స్ట్ కూడా ఫ్లెక్సీలపై ముద్రించారు.

మరో వైపు కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆరెస్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. మరి కొద్ది సేపట్లో కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరనుండగా, ఇప్పటికే ఆమె బస చేసిన కేసీఆర్ ఇంటికి వందలాది మంది బీఆరెస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు.కవితకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News