ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. కోటి నష్టపరిహారం

ఒకరకంగా ఇద్దరికీ ఇది అవమానమే అయినా మహిళా అధికారులిద్దరూ ఇగోలకు పోయి గోలగోల చేస్తున్నారు. తాజాగా మళ్లీ సోషల్ మీడియా పోస్టిం గ్ లు, పరువునష్టం నోటీసులతో మరోసారి రచ్చ మొదలు పెట్టారు ఐఏఎస్, ఐపీఎస్ లు.

Advertisement
Update: 2023-02-23 16:36 GMT

ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూప మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు చివరకు నష్టపరిహారం వరకు వెళ్లింది. ఇద్దరినీ బదిలీ చేసి, పోస్టింగ్ లు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ఇకపై సోషల్ మీడియాలో రచ్చకెక్కొద్దని సూచించినా వారు వినలేదు. తన కుటుంబాన్ని కాపాడుకోడానికి తాను పోరాడుతున్నానంటూ రూప సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. అటు రోహిణి.. రూపపై మరోసారి భగ్గుమన్నారు. తన పరువుకి భంగం కలిగిందని, కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులిచ్చారు.

ఐఏఎస్ రోహిణిపై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఆమె ఓ ఎమ్మెల్యేతో కలసి ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గొడవను మొదలు పెట్టారు ఐపీఎస్ రూప. అక్కడితో ఆగకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సీనియర్ ఐఏఎస్ లకు కూడా పంపించారు. దీంతో రోహిణి హర్ట్ అయ్యారు. తన వ్యక్తిగత ఫొటోలతో రూపకు ఏంపని అని మండిపడ్డారు. దీన్ని రూప ఖండించారు. తాను ఎవరెవరికి ఆ ఫొటోలు పంపించానో చెప్పాలని నిలదీశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే.. చీఫ్ సెక్రటరీ వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరిపై బదిలీ వేటు వేసి, పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనపెట్టారు.

ఒకరకంగా ఇద్దరికీ ఇది అవమానమే అయినా మహిళా అధికారులిద్దరూ ఇగోలకు పోయి గోలగోల చేస్తున్నారు. తాజాగా మళ్లీ సోషల్ మీడియా పోస్టిం గ్ లు, పరువునష్టం నోటీసులతో మరోసారి రచ్చ మొదలు పెట్టారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులు. ఈ స్థాయిలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య, అది కూడా ఇద్దరు మహిళల మధ్య గొడవ రావడం, బజారునపడటం, చివరకు పోస్టింగ్ లు కూడా లేకుండా క్రమశిక్షణ చర్యలకు గురికావడం ఇదే తొలిసారి అన తెలుస్తోంది. మొత్తానికి రోహిణి సింధూరి, రూప మౌద్గిల్ ఇద్దరూ వారి వారి కెరీర్ లో సాధించిన విజయాలతో కాకుండా.. వ్యక్తిగత గొడవలతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

Tags:    
Advertisement

Similar News