రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు, పూర్తిగా కాలిపోయిన కారు

అప్పటికే రిషబ్‌ను బయటకు తీశారు. రిషబ్ తలకు బ‌ల‌మైన‌ గాయమైంది. వెంటనే పంత్‌ను ఆస్పత్రికి తరలించారు. పంత్ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.

Advertisement
Update: 2022-12-30 04:26 GMT

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతడి కారు పూర్తిగా దగ్ధ‌మైపోయింది. రిషబ్‌ తలకు, కాలికి తీవ్ర గాయాల‌య్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రిషబ్‌ కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. అప్పటికే రిషబ్‌ను బయటకు తీశారు. రిషబ్ తలకు బ‌ల‌మైన‌ గాయమైంది. వెంటనే పంత్‌ను ఆస్పత్రికి తరలించారు. పంత్ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.

Tags:    
Advertisement

Similar News