Taraka Ratna Health Condition: కళ్లలో కదలిక ఉంది, కోలుకుంటాడు -బాలకృష్ణ

Taraka Ratna Health Condition: తారకరత్న కళ్లో కదలిక తెలుస్తోందని, బ్రెయిన్ డ్యామేజ్ అయిందని అంటున్నారని, ఆయన కోలుకున్న తర్వాతే ఏ స్థాయిలో డ్యామేజ్ అయి ఉంటుందో తెలుస్తుందన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

Advertisement
Update: 2023-01-29 07:24 GMT

Taraka Ratna Health Condition: కళ్లలో కదలిక ఉంది, కోలుకుంటాడు -బాలకృష్ణ

Taraka Ratna Health Condition: తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితిపై నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకతర్నను ఆయన పరామర్శించారు. ఆయన వెంట కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. డాక్టర్లతో మాట్లాడిన అనంతరం బాలయ్య మీడియాకు వివరాలు తెలియజేశారు. అభిమానులందరి ప్రార్థనలతో తారకరత్న తిరిగి కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

తారకతర్నను కుప్పం నుంచి తీసుకొచ్చిప్పటికి ఇప్పటికి పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని నిలకడగానే ఉందని, సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. పరిస్థితి మరింత విషమించకుండా డాక్టర్లు చూసుకుంటున్నారని చెప్పారు బాలకృష్ణ. తారకరత్న కళ్లో కదలిక తెలుస్తోందని, బ్రెయిన్ డ్యామేజ్ అయిందని అంటున్నారని, ఆయన కోలుకున్న తర్వాతే ఏ స్థాయిలో డ్యామేజ్ అయి ఉంటుందో తెలుస్తుందన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

కర్నాటకలో కూడా నందమూరి కుటుంబానికి అభిమానులున్నారని, రాజ్ కుమార్ కుటుంబంతో కూడా తమకు మంచి అనుబంధం ఉందని చెప్పారు బాలకృష్ణ. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకోడానికి వచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుప్పంలోనే తారకరత్న విషయంలో అద్భుతం జరిగిందని, అదృష్టవశాత్తు అచేతనంగా పడిపోయిన ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆయన్ను బెంగళూరుకి తరలించామన్నారు. తమ కుటుంబంలో ఉన్న వైద్యులు కూడా బెంగళూరు ఆస్పత్రిని రిఫర్ చేశారని, అందుకే ఇక్కడికి తెచ్చామన్నారు. తారకరత్న అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అని, అందుకే ఆయనకోసం అందరూ ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News