కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: లేటెస్ట్ ప్రీపోల్ సర్వే ఏం చెప్తోంది..?

మెజార్టీ సర్వేలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించనున్నదని తేల్చాయి. అయితే తాజాగా TV9, C-Voter ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో తేలిన విషయాలను ఒక సారి చూద్దాం....

Advertisement
Update: 2023-04-26 07:55 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023: లేటెస్ట్ ప్రీపోల్ సర్వే ఏం చెప్తోంది ?

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల రెండో వారంలో (మే 10న) ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ చాలా కాలంగానే దేశవ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటి వరకు అనేక సర్వేలు కూడా వచ్చాయి. మెజార్టీ సర్వేలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించనున్నదని తేల్చాయి. అయితే తాజాగా TV9, C-Voter ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో తేలిన విషయాలను ఒక సారి చూద్దాం....

టీవీ9, సీ-వోటర్ నిర్వహించిన సర్వే ప్రకారం... కర్ణాటక, ఓల్డ్ మైసూర్‌లోని 55 సీట్లలో బీజేపీకి 4 నుంచి 8 సీట్లు రావచ్చని, కాంగ్రెస్‌కు 21 నుంచి 25 సీట్లు రావచ్చని తేలింది. అదే సమయంలో ఇక్కడ జేడీఎస్ 24 నుంచి 28 సీట్లు సాధించవచ్చు.

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న‌ కర్ణాటకలోని 50 సీట్లలో బీజేపీకి 21 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్‌కు 25 నుంచి 29 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో జేడీఎస్ 1 సీటుతో సంతృప్తి చెందాల్సి రావచ్చు. అదేవిధంగా కోస్టల్ కర్ణాటకలోని 21 స్థానాల్లో బీజేపీకి 16 నుంచి 20 సీట్లు రావచ్చని, ఇక్కడ కాంగ్రెస్‌కు 1 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. సెంట్రల్ కర్ణాటకలో 35 సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ 13 నుంచి 17 సీట్లు, కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్లు గెలుచుకోవచ్చు. జేడీఎస్ కేవలం 1 సీటుతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది.

కర్ణాటకలోని గ్రేటర్ బెంగళూరులో 32 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు 18 నుంచి 22 సీట్లు, బీజేపీకి 7 నుంచి 11, జేడీఎస్‌కు 1 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా.

ఈ సర్వే ప్రకారం మొత్తం అసెంబ్లీ సీట్లలో ఈసారి కాంగ్రెస్ కు 106 నుంచి 116 సీట్లు వస్తాయి. బీజేపీకి 79 నుంచి 89 సీట్లు రావచ్చు. జేడీఎస్‌కు 24 నుంచి 34 సీట్లు వస్తాయని అంచనా.

Tags:    
Advertisement

Similar News