అణు యుద్దం జరగనుందా ? అమెరికా తన పౌరులకిచ్చిన సూచనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది

ఒక వేళ అణుబాంబు పడితే ఏం చేయాలో, ఏం చేయకూడదో అమెరికా తన పౌరులకు వివరించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఈ మేరకు పలు సూచనలను విడుదల చేసింది.

Advertisement
Update: 2022-09-23 08:50 GMT

ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న‌ రష్యా అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది అని అమెరికా పేర్కొంది. పశ్చిమ దేశాలపై కూడా రష్యా అణుబాంబులు వేసే అవకాశం ఉందని చెప్తున్న అమెరికా ఒక వేళ అణుబాంబు పడితే ఏం చేయాలో, ఏం చేయకూడదో తన పౌరులకు వివరించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఈ మేరకు పలు సూచనలను విడుదల చేసింది.

అణు విస్ఫోటనం సంభవించినప్పుడు కండీషనర్‌ని ఉపయోగించకూడదని ప్రత్యేకంగా పేర్కొంది. కండీషనర్ జిగురులా పని చేసి రేడియోధార్మిక ధూళి జుట్టుకు అంటి పెట్టుకునే అవకాశం ఉందని CDC పేర్కొంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కండీషనర్లను వాడవద్దని చెప్పింది.

అణుబాంబు పేలితే, రేడియోధార్మిక ధూళి గాలిలోకి వ్యాపిస్తుంది అందువల్ల మీరు అంతకు ముందు వేసుకున్న‌ దుస్తులను వెంటనే తీసివేసి వీలైనంత త్వరగా స్నానం చేయాలి అని సూచించింది.

ఎవరైనా అణు విస్ఫోటనానికి గురైతే, వారు రేడియేషన్‌ను నివారించడానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనం లోపల ఆశ్రయం పొందాలి, అని US CDC సిఫార్సు చేసింది. ప్రజలు తమ కళ్ళు, ముక్కు, నోటిని తాకకుండా ఉండాలని కూడా సూచించింది.

Tags:    
Advertisement

Similar News