మీరు నమ్మినా నమ్మకపోయినా! ఎలోన్ మస్క్ పెంపుడు కుక్క ఇప్పుడు ట్విట్టర్ కొత్త CEO

ఎలోన్ మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి ని తమ ట్విట్టర్ సంస్థ కొత్త CEO అని ప్రకటించారు. పైగా 'ఫ్లోకీ' మునుపటి CEO కంటే మెరుగైనది అని కామెంట్ పోస్ట్ చేశారు.

Advertisement
Update: 2023-02-15 05:48 GMT

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత మొట్తమొదట చేసిన పని అప్పటిదాకా ఆ సంస్థకు సీఈఓ గా ఉన్న పరాగ్ అగర్వాల్ ను ఉద్యోగ‍లోంచి తీసేయడం. అది జరిగి చాలా కాలమే అయినా కూడా ఎందుకో ఎలాన్ మస్క్ కు పరాగ్ పై కసి తగ్గలేదు. వీలు చిక్కినప్పుడల్లా పరాగ్ అగర్వాల్ ను అవమానించడమే పనిగా పెట్టుకున్నారాయన. ఈ రోజు మళ్ళీ అలాంటి పనే చేశారు.

ఎలోన్ మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి ని తమ ట్విట్టర్ సంస్థ కొత్త CEO అని ప్రకటించారు. పైగా 'ఫ్లోకీ' మునుపటి CEO కంటే మెరుగైనది అని కామెంట్ పోస్ట్ చేశారు.

CEO లోగోతో ఉన్న షర్ట్ వేసుకున్న ఆ కుక్క ఓ కుర్చీలో కుర్చొని ఉన్న ఫోటో ను పోస్ట్ చేసిన మస్క్ 'అద్భుతమైన ట్విట్టర్ కొత్త సీఈఓ' అని, ఇది చాలా స్టైలిష్ గా ఉందని, కామెంట్లు చేశారు. పరాగ్ అగర్వాల్ ను దృష్టిలో పెట్టుకొని 'ఇతర వ్యక్తి' కంటే తన కుక్క ఫ్లోకీ మెరుగ్గా పని చేస్తుంది అని రాశారాయన.

ఇలా మూడు పోస్టులు చేసిన మస్క్ ఒక దాంట్లో అద్దాలు పెట్టుకొని కోటు వేసుకున్న ఫ్లోకీ ఫోటోను పోస్ట్ చేశారు.

అయితే ఇదంతా కమెడీగా చేసిందే. నిజంగా ఆయన తన కుక్కను సీఈఓ గా చేయలేదని మీకిప్పటికే అర్దమై ఉంటుంది. పరాగ్ అగర్వాల్ ను అవమానించేందుకే ఆయనీ పని చేశారు.

అయితే ట్విట్టర్ ను ఎలా బాగుచేద్దామన్నది ఆలోచించకుండా ఇతరులమీద పడి ఏడవడం మానేయాలని పలువురు నెటిజనులు ఎలాన్ మాస్క్ కు హితవు చెప్పారు. హాస్యానికి కూడా హద్దుంటుందని పలువురు విమర్శలు గుప్పించారు. 


Tags:    
Advertisement

Similar News