ఎడమచేతి వాటం వారిలో తెలివితేటలు ఎక్కువ ఉంటాయా?

ఎడమచేతి వాటంతో పనిచేసేవారి దినోత్సవం. అంటే ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అన్నమాట.

Advertisement
Update: 2022-08-13 10:51 GMT

ఆగస్టు 13... ఎడమచేతి వాటంతో పనిచేసేవారి దినోత్సవం. అంటే ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అన్నమాట. ఈ ప్రపంచంలో పదిశాతం లేదా అంతకంటే తక్కువ మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారట. న్యూరో సైంటిస్టులు చేసిన అధ్యయనం ప్రకారం ఎడమచేతి వాటం కలవారి ఆలోచనా పరిధి మరింత విశాలంగా ఉంటుంది. అలాగే జనాభాలో వారి సంఖ్య నిష్పత్తిని బట్టి చూస్తే... నోబెల్ ప్రయిజ్ విజేతలు, రచయితలు, చిత్రకారుల్లో ఎడమచేతి వాటం ఉన్నవారు ఎక్కువమంది ఉన్నారని తెలుస్తోంది. వీరి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు

♦ వీరికి అలర్జీలు, మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువట. అలాగే నిద్రలేమితో బాధపడే అవకాశం కూడా ఎక్కువేనని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో మద్యం అలవాటు కూడా ఎక్కువే ఉండవచ్చు.

♦ వీరు కుడిచేతివాటం వారికంటే మరింత తెలివిగా ఉండే అవకాశం ఉందని, వీరు ఎక్కువ ఐక్యూని కలిగి ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కుడిచేతివాటం వారితో పోలిస్తే వీరు నాలుగైదు నెలల ఆలస్యంగా యుక్తవయసుకి చేరుతుంటారట.

♦ ఎడమచేతి వాటం ఉన్నవారు భాషాపరమైన సమస్యలతో బాధపడవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా ఎడమచేతి వాటం మగవారిలోనే ఎక్కువగా ఉంటుంది. వీరు మల్టీ టాస్కింగ్ లో మెరుగ్గా ఉంటారు. కళాత్మక రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు.

వీరంతా ఎడమచేతివాటం ఉన్నవారే...

అమితాబ్ బచ్చన్, సచిన్ టెండుల్కర్, బరాక్ ఒబామా, బిల్ గేట్స్, జూలియా రాబర్ట్స్, మార్క్స్ జుకెర్ బెర్గ్, లేడీ గాగా, ఒపెరా విఫ్రే, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మేరీ క్యూరీ, హెన్రీ ఫార్డ్, అరిస్టాటిల్, లియో నార్డో డావిన్సీ, చార్టీ చాప్లిన్, జిమ్ క్యారీ, టామ్ క్రూయిజ్, యాంజిలినా జూలీ, మార్లిన్ మన్రో, బ్రాడ్ పిట్, సిల్వెస్టర్ స్టాలోన్, అల్ బర్ట్ ఐన్ స్టీన్, నెపోలియన్ బోనాపార్టే, జూలియస్ సీజర్, స్టీవ్ జాబ్స్ మొదలైన ప్రముఖులు ఎడమచేతి వాటం వారే.

Tags:    
Advertisement

Similar News