ఎండలు పెరుగుతాయ్! జాగ్రత్తగా ఉండాలి!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 42 డిగ్రీల ఎండ నమోదవుతుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Advertisement
Update: 2024-04-21 16:20 GMT

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 42 డిగ్రీల ఎండ నమోదవుతుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనెజ్‌మెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల్లో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.

ఇలా చేయాలి

ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే నేరుగా ఎండ తగలకుండా టోపీ వంటివి పెట్టుకోవాలి లేదా వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. తెలుపు లేదా లేత రంగులు వాడాలి. కళ్లద్దాలు వాడాలి.

ఎండలో బయటకు వెళ్లినప్పుడు కళ్లు తిరగడం, నీరసంగా అనిపించడం, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడపట్టుకి వెళ్లాలి. ఇవి వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలి.

మీ చుట్టుపక్కల ఎవరైనా ఎండకి నీరసించినట్టు కనిపిస్తే వెంటనే వారికి సాయం చేయాలి. నిమ్మరసం తాగించాలి. అవసరమైతే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. అలాగే బయట్నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నిమ్మరసం, కొబ్బరి నీళ్ల వంటివి తాగుతుండాలి.

పిల్లలకు రోజూ మజ్జిగ, నిమ్మరసం వంటివి ఇస్తుండాలి. పెద్దవాళ్లు కూడా వీలైనంత వరకూ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటుండాలి. రోజుకి రెండు సార్లు స్నానం చేయాలి.

ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు తగిన ఎర్పాట్లు చేసుకోవాలి. కిటికీలకు పరదాలు కప్పుకోవడం, కూలర్లు వాడడం వంటివి చేయాలి.

ఇంట్లో జంతువులు ఉంటే వాటిని నీడలో ఉంచేలా తగిన ఎర్పాట్లు చేయాలి. అలాగే అవి తాగేందుకు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.

ఇవి చేయొద్దు

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయట తిరగకుండా జాగ్రత్తపడాలి పిల్లలు, బాలింతలు, వృద్ధులను ఇంటి పట్టునే ఉండేలా చూసుకోవాలి. ఎండల్లో కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రిమ్స్ వంటివి తినడం తగ్గించాలి. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

Tags:    
Advertisement

Similar News