ఈ సైలెంట్ ఎటాక్స్‌తో జాగ్రత్త!

ఒకప్పటితో పోలిస్తే.. దీర్ఘకాలిక జబ్బులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. అందులోనూ ఎలాంటి సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా వచ్చే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

Advertisement
Update: 2023-02-28 11:47 GMT

ఈ సైలెంట్ ఎటాక్స్‌తో జాగ్రత్త!

ఒకప్పటితో పోలిస్తే.. దీర్ఘకాలిక జబ్బులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. అందులోనూ ఎలాంటి సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా వచ్చే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వాటిని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకునేలోపే జరగాల్సిన నష్టం జరుతుంది. ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ప్రమాదంగా మారుతుందో చెప్పడం కష్టంగా మారింది. కాబట్టి కొన్ని సైలెంట్ కిల్లర్స్ విషయంలో ముందునుంచే జాగ్రత్తగా ఉండాలి.

కిడ్నీ డిసీజ్

మనదేశంలో ప్రతి పది మందిలో ఒకరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లతో బాధపడుతన్నారని స్టడీలు చెప్తున్నాయి. కిడ్నీలు పూర్తిగా పాడయ్యే వరకూ బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. కిడ్నీలు పాడవుతున్నప్పుడు కొంతమందిలో కాళ్లు వాయడం, ముఖం ఉబ్బడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి గుర్తించినప్పుడు వెంటనే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి.

బీపీ

దేశంలో చాలామందిని వేధిస్తున్న సమస్య బీపీ. ముఖ్యంగా హై బీపీ లేదా హైపర్‌టెన్షన్ వల్ల చాలామంది గుండె సమస్యల బారినపడుతున్నారు. ఈ సైలెంట్ కిల్లర్‌‌ను ఎదుర్కోవాలంటే.. ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి. రక్తపోటుని పెంచే ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. శారీరక వ్యాయామం చేస్తుండాలి. కంటికి సరిపడా నిద్రపోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్‌ కూడా సైలెంట్ కిల్లర్స్‌లో ఒకటి. రక్తనాళాళ్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఇది గుండెకు వెళ్లే రక్తాన్ని బ్లాక్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి కొవ్వు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌ను ఇప్పటినుంచే కంట్రోల్ చేయాలి. స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలి. వ్యాయామాలు చేస్తుండాలి.

డయాబెటిస్

చెప్పాపెట్టకుండా వచ్చే డయాబెటిస్ చాలారకాల సమస్యలకు కారణమవుతోంది. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటిస్ మొదలవుతుంది. ఈ సైలెంట్ కిల్లర్‌‌ను కంట్రోల్ చేయాలంటే బరువు అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామాలు చేయాలి. విటమిన్స్, మినరల్స్ ఉండే హెల్దీ డైట్ తీసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించాలి.

థైరాయిడ్

ఇకపోతే థైరాయిడ్ సమస్య కూడా చెప్పాపెట్టకుండానే వస్తుంది. కొంతమందిలో థైరాయిడ్ లక్షణాలు కనిపించవు. కాబట్టి ఉన్నట్టుండి బరువు పెరగడం, మలబద్ధకం, ముఖం వాయడం లాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి. అలాగే ఏడాదికోసారైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.

క్యాన్సర్

సైలెంట్ కిల్లర్స్‌లో అత్యంత ప్రమాదకరమైది క్యాన్సర్. క్యాన్సర్ రావడానికి ఒక కారణమంటూ ఉండదు. రకరకాల కారణాల వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తుంటాయి. అయితే మనదేశంలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌‌లు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఆడవాళ్లు వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే పొగాకు, పొల్యూషన్, ఆల్కహాల్, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంటే చాలా రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News