ఈ ఏడాది బెస్ట్ వంటకాలివే

Most Popular Recipes in 2022: టేస్ట్‌అట్లాస్ 2022 ప్రకారం ప్రపంచంలోని 'టాప్ 5 బెస్ట్ ట్రెడిషనల్ ఫుడ్స్' లో - కరే (జపాన్), పికాన్హా (బ్రెజిల్), అమీజోస్ ఎ బుల్హావో పాటో (పోర్చుగల్), టాంగ్‌బావో (చైనా).. గుయోటీ (చైనా)లు నిలిచాయి.

Advertisement
Update: 2022-12-29 12:21 GMT

ఈ ఏడాది బెస్ట్ వంటకాలివే

ఈ డిజిటల్ యుగంలో అక్కడా ఇక్కడా అని తేడా లేదు ప్రపంచమంతా అరచేతిలోనే ఇమిడిపోతుంది. ఇలాంటి రోజుల్లో ఒక దేశపు కల్చర్ మరో దేశాన్ని ఈజీగా ప్రభావితం చేస్తుంది. మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్‌నే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇప్పుడు సాంప్రదాయ వంటకాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వంటకాల్లో ఎవరికి నచ్చింది వాళ్లు సెలక్ట్ చేసుకుంటున్నారు. అయితే 2022 గానూ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వంటకాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

'టేస్ట్‌ అట్లాస్' అనే సంస్థ ప్రతి ఏడాది ప్రపంచంలో 'బెస్ట్ క్యూసిన్ అవార్డ్స్' అందజేస్తుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్నిరకాల వంటకాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ అవార్డ్స్‌లో ఏయే వంటకాలు ముందు వరుసలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

'టేస్ట్ అట్లాస్ బెస్ట్ క్యూసిన్ అవార్డ్స్ 2022'లో భారతీయ వంటకాలు 5వ ర్యాంక్‌ సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టపడే సాంప్రదాయ వంటల్లో మన వంటలు ఐదో ప్లేస్ ను దక్కించుకున్నాయి. ఫస్ట్ ప్లేస్‌ మాత్రం ఇటాలియన్ వంటకాలకు దక్కింది. ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో ఇటాలియన్ డిషెస్ అగ్రస్థానంలో ఉన్నాయి. రెండో స్థానంలో గ్రీక్ వంటకాలు, మూడు నాలుగో స్థానాల్లో స్పానిష్, జపనీస్ వంటకాలు నిలిచాయి.

ఇకపోతే ప్రపంచంలోని అత్యుత్తమ సాంప్రదాయ వంటకాలలో.. భారతదేశానికి చెందిన 'షాహీ పనీర్' టాప్ 50 ర్యాంకింగ్‌లో చోటు దక్కించుకుంది. ఢిల్లీలోని 'కేక్ డా హోటల్‌'కు చెందిన 'షాహీ పనీర్' వంటకం.. ప్రపంచంలోని అత్యుత్తమ సంప్రదాయ వంటకాల్లో 28వ స్థానంలో నిలిచింది. వీటితో పాటు బటర్ చికెన్ 3వ ర్యాంక్, లక్నో కుర్మా 55వ ర్యాంక్‌, ఐటీసీ కోహినూర్ కి చెందిన హైదరాబాదీ బిర్యానీ 71వ ర్యాంకు దక్కించుకున్నాయి.

టేస్ట్‌అట్లాస్ 2022 ప్రకారం ప్రపంచంలోని 'టాప్ 5 బెస్ట్ ట్రెడిషనల్ ఫుడ్స్' లో - కరే (జపాన్), పికాన్హా (బ్రెజిల్), అమీజోస్ ఎ బుల్హావో పాటో (పోర్చుగల్), టాంగ్‌బావో (చైనా).. గుయోటీ (చైనా)లు నిలిచాయి.

Tags:    
Advertisement

Similar News