Game Changer | రామ్ చరణ్ సినిమా సాంగ్ రిలీజ్ ఎప్పుడు?

Game Changer - గేమ్ ఛేంజర్ నుంచి ఓ పాట వస్తుందని దీపావళి ముందు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు రాలేదు.

Advertisement
Update: 2023-12-20 15:28 GMT

రామ్ చరణ్, దర్శకుడు శంకర్ మొదటిసారిగా గేమ్ ఛేంజర్ సినిమాతో కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ అనేక సమస్యలతో సాగి అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ జరగండిని దీపావళికి విడుదల చేయాలనుకున్నా చివరి నిమిషంలో వాయిదా పడింది. 'జరగండి' పాటను గేమ్ ఛేంజర్ టీమ్ పూర్తిగా మరిచిపోయింది.

గేమ్ ఛేంజర్ పూర్తి పాట, మంచి క్వాలిటీతో ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఓ వర్గం వారు బాగుందని భావించగా, చాలామంది మాత్రం శంకర్ రేంజ్ లో సాంగ్ లేదని కామెంట్ చేశారు.

దాంతో పాటల్ని అఫీషియల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన టీమ్.. ఆ ప్లాన్ మార్చుకుంది. రిలీజ్ చేయాల్సిన పాటను కూడా ఆపేసింది. అదే సమయంలో, శంకర్ ఇండియన్-2 షూటింగ్‌లో బిజీ అయ్యాడు. అటు సంగీత దర్శకుడు థమన్ కూడా ఆ పాటకు గాయకుడిని మార్చాలని అనుకున్నాడు.


ఇన్ని స‌మ‌స్య‌ల‌ మధ్య పాట విడుద‌ల‌ను టీమ్ వాయిదా వేసింది. అయితే, బాధాకరమైన విషయం ఏంటంటే.. వాయిదా పడి నెల గడిచినా, మేకర్స్ నుండి ఇంకా అప్‌డేట్ రాలేదు.

Tags:    
Advertisement

Similar News