Gurthunda Seethakalam Movie Review: 'గుర్తుందా శీతా కాలం' - రివ్యూ {1.5 /5}

Gurthunda Seethakalam Movie Review: సత్యదేవ్ హీరోగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' ఈ రోజు విడుదలైంది. దీనికి దర్శకుడు నాగశేఖర్ అనే కన్నడ అతను, ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సత్యా దేవ్ సరసన నటించారు. 'గుర్తుందా శీతాకాలం అనేది పోయెటిక్ టైటిల్.

Advertisement
Update: 2022-12-09 11:25 GMT

Gurthunda Seethakalam Movie Review: గుర్తుందా శీతా కాలం రివ్యూ

చిత్రం: గుర్తుందా శీతా కాలం

దర్శకత్వం : నాగశేఖర్

తారాగణం : సత్యదేవ్, తమన్నా, సుహాసిని, మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి, ప్రియదర్శి తదితరులు

సంగీతం : కాలభైరవ, ఛాయాగ్రహణం : సత్యా హెగ్డే

బ్యానర్స్ : వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టయిన్మెంట్స్

నిర్మాతలు : చింతపల్లి రామారావు, భావనా రవి, నాగశేఖర్

విడుదల : డిసెంబర్ 9, 2022

రేటింగ్ :1.5 /5

'గాడ్ ఫాదర్' లో విలన్ గా నటించిన తర్వాత సత్యదేవ్ హీరోగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' ఈ రోజు విడుదలైంది. దీనికి దర్శకుడు నాగశేఖర్ అనే కన్నడ అతను, ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సత్యా దేవ్ సరసన నటించారు. 'గుర్తుందా శీతాకాలం అనేది పోయెటిక్ టైటిల్ . మరి ఈ టైటిల్ కి తగ్గట్టుగా గుర్తుండిపోయే పొయెట్రీ లా వుందా ఈ సినిమా చూద్దాం...

కథ

దేవ్ (సత్యదేవ్) బెంగుళూరు వెళ్తూ దారిలో దివ్య (మేఘా ఆకాష్) అనే అమ్మాయిని దుండగుల బారి నుంచి కాపాడి లిఫ్ట్ ఇస్తాడు. ఆ ప్రయాణంలో ఆమె అడిగితే తన మూడు ప్రేమ కథలు చెప్పుకొస్తాడు. స్కూల్లో ఓ అమ్మాయిని ప్రేమిస్తే, ఆమె పేరెంట్స్ భయంతో తిరస్కరిస్తుంది, తర్వాత కాలేజీలో అమృత (కావ్యా శెట్టి) ని ఫ్రేమిస్తే ఆమె అతడి అంతస్తు సరితూగలేదని తిరస్కరిస్తుంది. చివరికి జాబ్ లో చేరాక నిధి (తమన్నా) అనే ఇంకో అమ్మాయిని కలుస్తాడు. ఇద్దరికీ కుదిరి పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్నాక ఇద్దరి జీవితాల్ని విధి ఎలా మలుపు తిప్పిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది కథలా లేదు. సత్యేదేవ్ నటించకూడని నసలా వుంది. 2020 లో కన్నడలో హిట్టయిన 'లవ్ మాక్ టైల్' కి రీమేక్ అని చెప్పారు. దీని హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో వుంది. దీన్ని చూస్తే ఎందుకు కన్నడలో హిట్టయ్యిందో అర్ధం గాదు. తెలుగులో కూడా మూడు ప్రేమ కథల్లో వుండాల్సిన రోమాన్సుల్లేవు, ఎమోషన్సు లేవు, డ్రామా లేదు. ప్రారంభం నుంచీ ముగింపు వరకూ జీవం లేని పాత్రలు, జీవం లేని కథ, ఏ మాత్రం యూత్ అప్పీల్ లేని వ్యవహారం. శీతాకాలం ఏమోగానీ, రెండున్నర గంటల పాటు ఉక్కబోత భరించలేక పారిపోవాలన్పిస్తుంది. ఇంతకంటే చెప్పుకోవడానికేమీ లేదు.

నటనలు-సాంకేతికాలు

సత్యదేవ్ నటించిన అత్యంత పూర్ క్వాలిటీ సినిమా ఇది. తన యాక్టింగ్ స్కిల్స్ కి లోటు చేయలేదు, కానీ విషయం లేనప్పుడు తన స్కిల్స్ సినిమాని కాపాడలేవు. దీన్నొక ప్రేమ కథగా ఎలా భావించి నటించాడో అర్ధంగాదు. పూర్తి పాసివ్ పాత్రతో, ప్రేమకోసం సంఘర్షణ చేయని పాత్ర చిత్రణతో, ఎక్కడా కథ అనేదాన్న తన పాత్రతో పుట్టించలేక పోయాడు. ఇంకేం సినిమా వుంటుంది, తన నటన గురించి చెప్పుకోవడాని కేముంటుంది.

తమన్నా వల్ల గొప్ప గ్లామర్ కూడా రాలేదు సినిమాకి. ఎందుకంటే తనది అసలే ట్రాజడీ పాత్ర. ట్రాజడీని తను బాగానే నటించ వచ్చు. కానీ సినిమాలో విషయం లేకపోతే ఎంత నటించీ లాభం వుండదు. పైగా ఈ ట్రాజడీ ఎప్పుడో అరిగిపోయిన పాత ఫార్ములా ట్రాజడీయే.

మేఘా ఆకాష్, కావ్యాశెట్టి పాత్రలకి ఆ మాత్రమైనా బలం వుంది. కానీ వాళ్ళ నుంచి నటనల్ని రాబట్టుకోలేకపోవడం దర్శకుడి లోపం. అసలు దర్శకత్వమే పూర్ గా వుంది. దర్శకత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

చెప్పుకోవాల్సింది కాల భైరవ సమకూర్చిన పాటల గురించి, సత్యా హెగ్డే కెమెరా వర్క్ గురించీ. ఇవి రెండే సినిమా అనే ఈ కళా రూపానికి బలం. మిగిలినవి బలహీనం, కళా విహీనం. సత్యదేవ్ ఇక ముందు ఇలాటి సినిమాలు చేయడని ఆశిద్దాం.

Tags:    
Advertisement

Similar News