Jailer Movie | బుల్లితెరపై జైలర్ వరల్డ్ వైడ్ రిలీజ్

Jailer Movie - థియేటర్లలో సూపర్ హిట్టయిన జైలర్ మూవీ, బుల్లితెరపై కూడా అరుదైన రికార్డ్ సృష్టించింది. అదేంటో చూద్దాం..

Advertisement
Update: 2023-11-13 16:51 GMT

Jailer Movie Review | జైలర్ మూవీ రివ్యూ {3/5}

టెలివిజన్‌ చరిత్రలో రజనీకాంత్ జైలర్ చరిత్ర సృష్టించింది. ఒకే సమయంలో అన్ని భాషల్లో టెలివిజన్ ప్రీమియర్‌లను ప్రదర్శించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా తమిళంలో సన్ టీవీ, తెలుగులో జెమినీ టీవీ, హిందీలో స్టార్ గోల్డ్ ఇండియా ఛానెల్, కన్నడలో ఉదయ టీవీలో ప్రీమియర్‌గా ప్రదర్శించారు.

సినిమాల్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం చూశాం. కానీ టీవీల్లో కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రీమియర్ గా వేయడం జైలర్ తోనే మొదలైంది. ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ చిత్రం అన్ని భాషలలో మంచి టీఆర్పీ రేటింగ్స్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే రజనీకాంత్, బుల్లితెరపై కూడా చరిత్ర సృష్టించినట్టే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే .

నవంబర్ 12న సాయంత్రం 6:30 గంటలకు జెమినీ టీవీలో తెలుగు వెర్షన్, సన్ టీవీలో తమిళ వెర్షన్, ఉదయ టీవీలో కన్నడ వెర్షన్ ను ప్రసారం చేశారు. అలాగే, స్టార్ గోల్డ్ ఛానెల్ లో హిందీ వెర్షన్‌ టెలికాస్ట్ అయింది. మలయాళ వెర్షన్ ప్రీమియర్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

నెల్సన్ దిలీప్‌కుమార్ డైరక్ట్ చేసిన జైలర్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, సునీల్, యోగిబాబు లాంటి స్టార్స్ నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News