Balagam - బుల్లితెరపై కూడా బలగం హిట్

Balagam movie - సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన బలగం మూవీ బుల్లితెరపై కూడా హిట్ అయింది.

Advertisement
Update: 2023-05-19 10:55 GMT

థియేటర్లలో సంచలన విజయం సాధించింది బలగం సినిమా. మరీ ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఈ సినిమా చొచ్చుకుపోయింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత, తెలంగాణ పల్లెల్లో పరదాలు కట్టి ఈ సినిమాను ప్రదర్శించారు. ఊళ్లకు ఊళ్లు కదిలొచ్చి ఈ సినిమాను చూశాయి. అలా థియేటర్లలో సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా, ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే జోరు చూపించింది.


స్టార్ మా ఛానెల్ లో బలగం సినిమాను టెలికాస్ట్ చేశారు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తొలిసారి ప్రసారం చేసినప్పుడు ఈ మూవీకి ఏకంగా 14 టీవీఆర్ రావడం విశేషం. స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా ఈమధ్య ఈ స్థాయిలో రేటింగ్ రాలేదు. సో.. బలగం బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ అయిందన్నమాట. 


కమెడియన్ వేణు, దర్శకుడిగా మారి తీసిన సినిమా ఇది. అటు దిల్ రాజు కుమార్తె నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో 90శాతం మంది కొత్తవాళ్లు నటించారు. అయినప్పటికీ సినిమాలో సన్నివేశాలు, అందులో ఎమోషన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అందుకే బలగం సినిమా క్లాసిక్ అయింది.

Tags:    
Advertisement

Similar News