బీజేపీ, వైసీపీతో అంటకాగుతుందని జనం అనుకుంటున్నారు.... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

అధికార వైసీపీ తో తాము ‍అంటకాగుతున్నామని ప్రజలు భావిస్తున్నారని, అందువల్లనే తమను చిత్తుగా ఓడించారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికను అంత తేలికగా తీసుకోవద్దని ఉత్తరాంధ్రలోని 34 నియొజకవర్గాల గ్రాడ్యుయేట్లు తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని, ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందస్తు సూచిక అని ఆయన అన్నారు.

Advertisement
Update: 2023-03-18 10:42 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇప్పటికే ఉన్న వర్గపోరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరింత పెంచింది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటి చేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు డిపాజిట్ కూడా రాకపోవడంతో ఆ పార్టీలో రగడ మొదలయ్యింది.

అధికార వైసీపీ తో తాము ‍అంటకాగుతున్నామని ప్రజలు భావిస్తున్నారని, అందువల్లనే తమను చిత్తుగా ఓడించారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికను అంత తేలికగా తీసుకోవద్దని ఉత్తరాంధ్రలోని 34 నియొజకవర్గాల గ్రాడ్యుయేట్లు తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని, ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందస్తు సూచిక అని ఆయన అన్నారు. తమ అభ్యర్థి మాదవ్ కు ఒచ్చిన ఓట్లను చూస్తే ప్రతి నియోజకవర్గం నుండి సగటున 340 ఓట్లు పడ్డాయని , దీన్ని బట్టే బీజేపీ పరిస్థితి ఏంటో అర్దం చేసుకోవాలని విష్ణు కుమార్ రాజు అన్నారు.

ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, అధికార పక్షం లక్షల రూపాయలు వెదజల్లినా ఓటర్లు ఆ పార్టీని ఓడించారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని ఓడించడానికి, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని విష్ణు కుమార్ రాజు పార్టీ అగ్రనేతలకు హితవు పలికారు.

తాము, వైసీపీ ఒక్కటే అన్న ప్రజల అభిప్రాయం తప్ప‌ని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికైనా రుజువు చేయాలని ఆయన సూచించారు.. 

Tags:    
Advertisement

Similar News