ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలనే స్వామివారికి కానుక: టీటీడీ చైర్మన్ దంపతులు

శ్రీ శ్రీనివాస మహా విశ్వశాంతి యాగం విజయవంతంగా ముగిసినందుకు టీటీడీ చైర్మన్ దంపతులు శ్రీవారికి 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు కంఠాభరణం కానుకగా సమర్పించారు.

Advertisement
Update: 2022-12-18 14:37 GMT

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆదివారం 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌కు చైర్మన్ దంపతులు ఈ ఆభరణం అందించారు.


Delete Edit

విశ్వశాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠంలో ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహా యాగం ఆదివారం మహా పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆయ‌న‌ శ్రీమతి స్వరలత ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన దేశంపై కరోనా ప్రభావం ఉండకూడదని, ప్రపంచంలోని ప్రజలే కాకుండా సకల జీవులు ఆరోగ్యాంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ యాగం నిర్వహించామన్నారు. తిరుమలలో ఇప్పటి దాకా జరగని ఇలాంటి యాగం స్వామివారి ఆశీస్సులతో తాము చేయించడం అదృష్టమని వారు చెప్పారు. శ్రీ శ్రీనివాస మహా విశ్వశాంతి యాగం విజయవంతంగా ముగిసినందు వల్ల స్వామ వారికి కానుక సమర్పించామని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News