చంద్రబాబుకు పెద్దాపురంలో షాక్

ఎప్పుడైతే నిమ్మకాయలను చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారో వెంటనే నిరసనలు మొదలయ్యాయి. చంద్రబాబు ఎంత చెప్పినా కార్యకర్తలు వినిపించుకోలేదు. పైగా చంద్రబాబువారిస్తున్న కొద్దీ కార్యకర్తలు రెచ్చిపోయి నిమ్మకాయలతో పాటు చంద్రబాబుకు కూడా వ్యతిరేకంగా నినాదాలతో రెచ్చిపోయారు.

Advertisement
Update: 2023-02-18 05:41 GMT

చంద్రబాబునాయుడుకు పెద్దాపురం నేతలు, కార్యకర్తలు పెద్ద షాకే ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పెద్దాపురం నుండి మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తారని చంద్రబాబు బహిరంగసభలో ప్రకటించారు. మూడోసారి కూడా చినరాజప్పనే గెలిపించాలని జనాలకు, నేతలకు విజ్ఞప్తి చేశారు.


చంద్రబాబు ప్రకటనతో మామూలు జనాలు ఎలాగున్నా నేతలు, కార్యకర్తలు మాత్రం ముందు షాక్ తిని తర్వాత మండిపోయారు. దాని ఫలితంగానే చంద్రబాబుకు నిరసన సెగలు మొదలయ్యాయి.

వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో పోటీ చేయాలని బొడ్డు వెంకటరమణ చౌదరి, చంద్రమౌళి ఎంతగానో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అవసరమైనపుడల్లా పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బులు ఖర్చుపెడుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలకు ఎప్పుడు అవసరమైనా అందుబాటులో ఉంటున్నారు. నిమ్మకాయల పేరుకు మాత్రమే ఎమ్మెల్యే కానీ మొత్తం వ్యవహారాలన్నీ బొడ్డు, చంద్రమౌళే నడిపిస్తున్నారు. పైగా ఇద్దరు నేతలు పెద్దాపురానికి స్థానికులు కావటంతో పాటు నిమ్మకాయల వలసనేత.

అందుకనే నిమ్మకాయలకు నియోజకవర్గంలో పెద్దగా మద్దతుదారులంటు లేరు. వచ్చే ఎన్నికల్లో నిమ్మకాయలకు కాకుండా తమకే టికెట్లు ఇవ్వాలని ఇప్పటికే వీళ్ళిద్దరు చంద్రబాబు, లోకేష్‌ను కలిసినపుడల్లా మాట్లాడుతునే ఉన్నారు.


వీళ్ళడిగిపుడు ఏమీ మాట్లాడకుండా పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు చెప్పారు. దాంతో టికెట్‌పై ఆశలు పెట్టుకుని వీళ్ళిద్దరు రెచ్చిపోయి పనిచేశారు. అయితే నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబు వీళ్ళిద్దరితో మాట మాత్రం కూడా చెప్పకుండానే రాజప్పను అభ్యర్థిగా ప్రకటించటాన్ని తట్టుకోలేకపోయారు.

ఎప్పుడైతే నిమ్మకాయలను చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారో వెంటనే నిరసనలు మొదలయ్యాయి. చంద్రబాబు ఎంత చెప్పినా కార్యకర్తలు వినిపించుకోలేదు. పైగా చంద్రబాబువారిస్తున్న కొద్దీ కార్యకర్తలు రెచ్చిపోయి నిమ్మకాయలతో పాటు చంద్రబాబుకు కూడా వ్యతిరేకంగా నినాదాలతో రెచ్చిపోయారు. దాంతో ఏమిచేయాలో అర్థంకాక‌ చంద్రబాబు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేశారు.


ఇదంతా చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో చినరాజప్పకు ఎవరైనా సహకరిస్తారా అనే డౌటు పెరిగిపోతోంది. కాకపోతే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అసంతృప్త నేతలను బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు సమయముంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News