బొత్స ఝాన్సీయే ఎందుకంటే.. పక్కా లోకల్‌ ట్యాగ్‌

విశాఖ ఆడపడుచు అనే ట్యాగ్‌ లైన్‌తో ఆమె బరిలోకి దిగారు. విశాఖ తన పుట్టిల్లు అని ఆమె చెప్పుతున్నారు. విశాఖ ప్రాంతవాసిగా స్థానిక సమస్యలన్నీ తనకు తెలుసునని ఆమె అంటున్నారు.

Advertisement
Update: 2024-03-16 14:13 GMT

విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. అయితే, అనూహ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆమెను విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయిస్తారని భావించారు. కానీ జగన్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేయడం వెనక బలమైన కారణమే ఉంది.

విశాఖ ఆడపడుచు అనే ట్యాగ్‌ లైన్‌తో ఆమె బరిలోకి దిగారు. తన సొంత గడ్డ విశాఖ అని, తన పుట్టిల్లు విశాఖ అని ఆమె చెప్పుతున్నారు. విశాఖ ప్రాంతవాసిగా స్థానిక సమస్యలన్నీ తనకు తెలుసునని ఆమె అంటున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి స్థానికత కూడా కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. అందుకే విశాఖ ఆడపడుచునంటూ ముందుకు వస్తున్నారు. ఇటీవ‌లే ఎంపీ పార్టీ ఆఫీస్‌ను ఝాన్సీ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థులంతా హాజరయ్యారు.

విశాఖ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ మూడు సార్లు గెలిచింది. అయితే టీడీపీ వరుసగా విజయం సాధించలేదు. 2019లో విశాఖ నుంచి వైసీపీ గెలిచింది. విశాఖ నుంచి చివరిసారి టీడీపీ 1999లో గెలిచింది. 

Tags:    
Advertisement

Similar News