పవన్ కల్యాణ్ ని చూసి ఒక ఆర్టిస్ట్ గా సిగ్గుపడుతున్నా –రోజా

చంద్ర బాబు తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ కట్టుకుంటారని, బాబు కష్టాల్లో ఉంటే మాత్రం ఆయన బయటకు వస్తారని మండిపడ్డారు రోజా.

Advertisement
Update: 2023-01-05 10:05 GMT

తిరుపతి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి రోజా మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఎమోషన్ లు లేవని విమర్శించారు. ఒక ఆర్టిస్ట్ గా పవన్ ని చూసి తాను సిగ్గు పడుతున్నానని చెప్పారు. సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని ఓడించినా ఆయనకు సిగ్గులేదన్నారు. చంద్ర బాబు తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ కట్టుకుంటారని, బాబు కష్టాల్లో ఉంటే మాత్రం ఆయన బయటకు వస్తారని మండిపడ్డారు. కందుకూరు ఘటనలో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. పవన్ కి ప్రజలే రాజకీయ సమాధి కడతారన్నారు.

చంద్రబాబు నాయుడు.. శవాల నాయుడు

చంద్రబాబు నాయుడు శవాల నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. ఆయన ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే పొలిటికల్ సైకో చంద్రబాబు అని, ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి చివరకు తన ప్రచారం కోసం ప్రజల ప్రాణాలు తీసే వరకు సైకో చంద్రబాబు నిద్రపోవడం లేదన్నారు. టీడీపీ, జనసేన సైకో పార్టీలంటూ విమర్శించారు.

సీఎం జగన్ ని సైకో సైకో అంటూ పదే పదే విమర్శిస్తున్న చంద్రబాబే అసలైన సైకో అన్నారు రోజా. పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేసిన చంద్రబాబు సైకో కాక ఇంకేంటి అని అన్నారు. ఒక ఎమ్మెల్యేని ఏడాది పాటు అసెంబ్లీకి రానివ్వకుండా చేసిన సైకో ఆయన అని అన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సైకో చంద్రబాబు అని అన్నారు. కుప్పం లో చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని, బాబు కంటే కుప్పాన్ని జగన్ ఎక్కువ అభివృద్ధి చేశారని చెప్పారు. కుప్పంలో గల్లీ గల్లీ తిరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈడ్చి తన్నితే బాబు హైదరాబాద్ లో పోయి పడ్డారని గుర్తు చేశారు.

పళ్లు రాలగొడతా..!

సీఎం జగన్ గురించి మాట్లాడితే పళ్లు రాలగొట్టి చేతిలో పెడతామని హెచ్చరించారు రోజా. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు తాము తలదించుకుంటున్నామని అన్నారామె. సీఎం జగన్ నిజంగా కక్ష సాధింపు చర్యలకు దిగితే చంద్రబాబు బయట అడుగు పెట్టలేరన్నారు.

Tags:    
Advertisement

Similar News