బ్లేడ్ బ్యాచ్ దాడి.. పవన్ సంచలన వ్యాఖ్యలు

తనపై ఎప్పుడు, ఎవరు దాడి చేశారో స్పష్టంగా చెప్పలేదు పవన్ కల్యాణ్. ఆ ఘటన ఎక్కడ జరిగింది, సెక్యూరిటీ వారికి గాయాలయ్యాయా, లేక ఇంకెవరైనా ఇబ్బందిపడ్డారా..? అనే విషయాలు కూడా చెప్పలేకపోయారు.

Advertisement
Update: 2024-04-01 15:28 GMT

"కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తారంటే.. ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్నటి బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు, నన్ను కూడా.. ఇటీవల ఇక్కడ కూడా జరిగింది. మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు మీకు తెలుసుకదా. అందుకే కొంత జాగ్రత్తగా ఉండాలి." అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ పవన్ పై దాడి చేసింది ఎవరు..? వారిని సెక్యూరిటీ వారు పట్టుకున్నారా..? పోనీ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారా..? ఈ వివరాలు తెలియాల్సి ఉంది.


ఎందుకీ వ్యాఖ్యలు..?

పిఠాపురంలో జరిగిన పార్టీ మీటింగ్ లో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను జనంలోకి రాలేకపోతున్నానని, అభిమానుల్ని కలసుకోవాలని ఉంటుంది కానీ.. ఇప్పుడు అలా చేయలేకపోతున్నానని, ఎన్నికల తర్వాత రోజుకి 200 మందిని పిలిచి మరీ ఫొటోలు దిగుతానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని.

సింపతీ గేమ్..

తనపై ఎప్పుడు, ఎవరు దాడి చేశారో స్పష్టంగా చెప్పలేదు పవన్ కల్యాణ్. ఆ ఘటన ఎక్కడ జరిగింది, సెక్యూరిటీ వారికి గాయాలయ్యాయా, లేక ఇంకెవరైనా ఇబ్బందిపడ్డారా..? అనే విషయాలు కూడా చెప్పలేకపోయారు. అదే నిజమైతే ఈపాటికి పవన్ పోలీస్ కేసులంటూ గగ్గోలు పెట్టేవారని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలంటూ గాల్లో రాళ్లు వేయడం, ప్రత్యర్థి పార్టీ పన్నాగాలంటూ వైసీపీ పేరు ప్రస్తావించకుండానే జనసైనికుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం..ఇవన్నీ ఓ ప్లాన్ ప్రకారమే జరిగాయని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన నేపథ్యంలో పవన్ మరింత క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News