చివరిగా నడ్డాతో భేటీ.. విజయవాడకు బయలుదేరిన జనసేనాని

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిశారు. ఈరోజు జేపీ నడ్డాని కలసి విజయవాడకు బయలుదేరారు.

Advertisement
Update: 2023-07-20 07:48 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరి భేటీ జరిగినట్టు తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ తోపాటు జేపీ నడ్డాను కలసిన జనసేనాని.. ఏపీ రాజకీయ వ్యవహారాలు ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతోపాటు, ఏపీలోని శాంతిభద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి జనసేనాని తీసుకెళ్లారని సమాచారం.


ఉమ్మడి ప్రణాళిక..

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ దశలో ఏపీలో బీజేపీ-జనసేన ఉమ్మడిపోరు గురించి కూడా నడ్డాతో జనసేనాని చర్చించారు. అయితే టీడీపీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందా లేదా అనేది అధికారిక ప్రకటనతోనే బయటకు రావాల్సిన విషయం.

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిశారు. ఈరోజు జేపీ నడ్డాని కలసి విజయవాడకు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ఈరోజు జనసేనలో చేరాల్సి ఉంది. పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ చేరికల మీటింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా పవన్ తన ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News