రూల్స్ పవన్‌కి మాత్రమే.. వైసీపీపై జనసేనాని సెటైర్

పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని పరిచయం చేసినప్పటి నుంచి ఏపీలో రాజకీయం మళ్లీ వైసీపీ వర్సెస్ జనసేనలా తయారైంది. వైసీపీ మంత్రులు, కీలక నేతలు పవన్‌ని విమర్శిస్తుండగా.. వారికి పవన్ కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement
Update: 2022-12-09 15:14 GMT

పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి వేసిన ఆలివ్ గ్రీన్ కలర్ ప్రైవేట్ వాహనాలకు వేయడం నిషిద్ధమని, ఆ విషయం కూడా పవన్‌కి తెలియదా? అని వైసీపీ శ్రేణులు విమర్శలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఎదురుదాడికి దిగారు. వరుసగా ట్వీట్లు పెడుతూ వైసీపీని విమర్శిస్తున్నారు.

ముందుగా ట్విట్టర్ వేదికగా ఆలివ్ గ్రీన్ కలర్ షర్ట్ పోస్ట్ చేసిన పవన్.. ఈ కలర్ షర్టు వేసుకోవడానికి అయినా వైసీపీ అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత శ్వాస తీసుకోడానికి కూడా వైసీపీ అనుమతి తీసుకోవాలేమో..అని వ్యంగంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు మరోసారి పవన్ వరుసగా ట్వీట్లు చేశారు. ముందుగా ఆలివ్ గ్రీన్ కలర్ చెట్లు భారీగా ఉన్న సముదాయం, ఆ తర్వాత అదే కలర్ కారు, బైక్ ఇమేజ్ లను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను షేర్ చేస్తూ రూల్స్ పవన్ కళ్యాణ్‌కు మాత్రమే.. అని సెటైర్ వేశారు.


అసూయ మనిషిని కుళ్లిపోయేలా చేస్తుందని స్కూల్లో ఉన్నప్పుడు చెప్పేవారని, వైసీపీ కూడా అంతే.. అని మరో ట్వీట్‌లో పవన్ విమర్శించారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని పరిచయం చేసినప్పటి నుంచి ఏపీలో రాజకీయం మళ్లీ వైసీపీ వర్సెస్ జనసేనలా తయారైంది. వైసీపీ మంత్రులు, కీలక నేతలు పవన్‌ని విమర్శిస్తుండగా.. వారికి పవన్ కౌంటర్ ఇస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సంబంధించి అతి త్వరలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. పవన్ యాత్ర ప్రారంభం కాకముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే.. ప్రారంభమైన తర్వాత ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News