పొత్తులపై తేల్చలేదు, విస్తృత సమావేశంలోనూ పాత పాటే

ముందస్తుకి చిత్రమైన కారణం కూడా చెప్పారు. టీడీపీ ఎన్నికలకు సిద్ధంగా లేదని జగన్ అనుకుంటున్నారని, అందుకే ఆయన ముందస్తుకి వెళ్తారని అన్నారు. అలా వెళ్లినా కూడా టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని చెప్పారు చంద్రబాబు.

Advertisement
Update: 2022-11-20 02:00 GMT

టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నారంటే, భవిష్యత్తు కార్యాచరణపై ఏదో ఒక సందేశం ఉంటుందని అనుకున్నారంతా. కానీ విచిత్రంగా అక్కడ కూడా పాతపాటే పాడారు చంద్రబాబు. సాంస్కృతిక విభాగం సభ్యులు మాత్రం 'ఇదేం ఖర్మరా ఈ జగన్ పాలనలో ' అనే కొత్త పల్లవి అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, లేకపోతే ఏపీలో జనం బతకలేరని అన్నారు చంద్రబాబు.

ముందస్తుకి సిద్ధమా..?

2019లో వైసీపీ గెలిచినప్పటినుంచీ చంద్రబాబు ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలంటూ సవాళ్లు విసురుతున్నారు. మూడున్నరేళ్లు పూర్తయిన తర్వాత కూడా ఆయన ఇంకా ముందస్తు అంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు చంద్రబాబు, దానికి చిత్రమైన కారణం కూడా చెప్పారు. టీడీపీ ఎన్నికలకు సిద్ధంగా లేదని జగన్ అనుకుంటున్నారని, అందుకే ఆయన ముందస్తుకి వెళ్తారని అన్నారు. అలా వెళ్లినా కూడా టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు.

కేసులకు భయపడొద్దు తమ్ముళ్లూ..

ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, వారి ఆస్తులు రాయించుకుంటున్నారని, వ్యాపారాల్లో వాటాలు అడుగుతున్నారని, కానీ ఎవరూ భయపడొద్దని, బెదిరిపోవద్దని సూచించారు చంద్రబాబు. టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో ధైర్యంగా ఎదురు నిలబడకపోతే, ఇక ఏపీ ప్రజల్ని ఎవరూ కాపాడలేరని చెప్పారాయన. టీడీపీని ప్రజలు గెలిపించలేకపోతే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. 

Tags:    
Advertisement

Similar News