చంద్రబాబు-పవన్ భేటీపై సెటైర్లు

బీజేపీతో పొత్తును వదిలేయటం కష్టంగా ఉందనే సాకును చూపించి బేరం పెంచుకోవటానికే చంద్రబాబుతో పవన్ తాజాగా భేటీ అయ్యారంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి పవన్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పెద్ద జోక్ అయిపోయారు.

Advertisement
Update: 2023-04-30 05:39 GMT

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అంటే నెటిజన్లకు చాలా చులకనైపోయింది. అందుకనే పవన్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పేలుతున్నాయి. చంద్రబాబుతో శుక్రవారం తమిళ నటుడు రజనీకాంత్ భేటీ కావటంతో ప్యాకేజీని రెన్యువల్ చేయించుకునేందుకే పవన్ ఇంత అర్జంట్‌గా చంద్రబాబును కలిశారని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అలాగే వారాహి బండి తాళాల కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళారని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చెణుకులు విసిరారు.

బీజేపీతో పొత్తును వదిలేయటం కష్టంగా ఉందనే సాకును చూపించి బేరం పెంచుకోవటానికే చంద్రబాబుతో పవన్ తాజాగా భేటీ అయ్యారంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి పవన్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పెద్ద జోక్ అయిపోయారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎలాంటి సీరియస్‌నెస్ లేకుండానే గడచిన పదేళ్ళుగా పవన్ రాజకీయ నేతగా చెలామణి అయిపోతున్నారు. మొన్నటి వరకు ఏపీలో పోటీ విషయంపైనే మాట్లాడిన జ‌న‌సేనాని ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని చెప్పారు.

నిజానికి జనసేనకు ఏపీలోనే దిక్కులేదు. అలాంటిది అసలు ఉనికే లేని తెలంగాణలో పోటీ చేయటం ఏమిటి? పోటీ చేస్తే ఏమవుతుంది? తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలకు ఉంది ఏడు నెలలు మాత్రమే. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ నిర్మాణమే జరగలేదు. అలాంటిది నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఎప్పుడు ఎంపిక చేస్తారు? ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు? అనే విషయాలపై పవన్‌లో ఇంతవరకు క్లారిటి కూడా లేదు. సుమారు 15 నియోజకవర్గాల్లో గెలిచేంత సత్తా జనసేనకు ఉందని అప్పుడెప్పుడో ఒక ప్రకటన చేశారు.

అప్పట్లో ఆ ప్రకటన పెద్ద జోక్ అయిపోయింది. ఇలాంటి అడ్డదిడ్డమైన రాజకీయాలు చేస్తున్న కారణంగానే పవన్ నెటిజన్లకు రెగ్యులర్‌గా టార్గెట్ అవుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపున‌కు సహకరించిన ఘనత పవ‌న్‌కు మాత్రమే దక్కుతుంది. ఆ మధ్య లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా డైరెక్ట్‌గా టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాల కారణంగానే ఇపుడు మళ్ళీ సోషల్ మీడియాలో నెటిజన్లకు పవన్ టార్గెట్‌గా మారిపోయారు.

Tags:    
Advertisement

Similar News