ఏపీలో పొలిటికల్ హీట్.. యువగళం మళ్లీ మొదలు

ఈ సారి యాత్రకు మరో విశేషం కూడా ఉంది. గతంలో యువగళంలో కేవలం పసుపు జెండాలు మాత్రమే కనపడేవి. ఈ సారి పసుపు జెండాలతోపాటు జనసేన జెండాలు కూడా రెపరెపలాడుతాయి.

Advertisement
Update: 2023-11-27 02:04 GMT

ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ కి చేరుకుంది. ఇటు ఏపీలో ఎన్నికలు లేకపోయినా రాజకీయ హడావిడి రోజూ ఉంటోంది. అందులోనూ ఈరోజు నారా లోకేష్ యువగళం యాత్ర తిరిగి ప్రారంభమవుతోంది. దీంతో ఇవాళ్టి నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు మళ్లీ మొదలు కాబోతున్నాయని తెలుస్తోంది. యువగళం యాత్రలో లోకేష్ ప్రసంగం ఎలా ఉంటుంది, దానికి వైసీపీ నేతల కౌంటర్లు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

79 రోజుల విరామం తర్వాత ఈ రోజు నుంచి మళ్లీ నారా లోకేష్ యువగళం యాత్ర మొదలుపెడుతున్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి ఆయన యాత్ర పునఃప్రారంభిస్తారు. సెప్టెంబరు 8న చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ తన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబుకి స్కిల్ కేసులో బెయిల్ రావడంతో లోకేష్ జనంలోకి వస్తున్నారు.

ఈసారి యాత్రకు మరో విశేషం కూడా ఉంది. గతంలో యువగళంలో కేవలం పసుపు జెండాలు మాత్రమే కనపడేవి. ఈసారి పసుపు జెండాలతోపాటు జనసేన జెండాలు కూడా రెపరెపలాడుతాయి. జనసేన నేతలు కూడా ఆయనకు మద్దతుగా యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈరోజు యాత్ర పునఃప్రారంభం అయ్యే సమయానికి పార్టీ ముఖ్య నాయకులతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ ఇన్ చార్జ్ లు పొదలాడకు చేరుకుంటారు. పొదలాడ నుంచి 2 కిలోమీటర్లు నడిచి.. తాటిపాక కూడలి వద్ద తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు లోకేష్. 

Tags:    
Advertisement

Similar News