జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర

వచ్చే ఏడాది జనవరి 27నుండి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం అయి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర సాగనుంది.

Advertisement
Update: 2022-11-11 08:25 GMT

ఇటీవల ఏ సభలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్నా తెలుగుదేశం భవిత యువతే అంటున్నారు. తన తనయుడు రాజకీయ అరంగేట్రానికి కూడా ఇదే యువమంత్రం పనికొస్తుందని భావిస్తున్నారు. ఓ వైపు పార్టీపై పట్టు సాధించడం, అదే సమయంలో జనానికి నారా లోకేష్ ని మరింత చేరువ చేయడానికి దీర్ఘకాలిక వ్యూహం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రమంతా పర్యటించి యువతతో ఇంటరాక్ట్ కావడం, వారి సమస్యలు గుర్తించి పరిష్కారానికి ప్రణాళికని ప్రకటించడం చేస్తున్నారు. నారా లోకేష్ టార్గెట్ గా సోషల్మీడియాలో సాగిన ట్రోలింగ్ విపరీతమైన నష్టం చేసింది. పొలిటికల్ ఎంట్రీతోనే ఎదురు దెబ్బ తగిలింది. సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా వుండే యువతకి చేరువ కావడానికి పాదయాత్రని వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. 2023, జనవరి 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందని అనధికార సమాచారం. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం అయి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు యాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ రెడీ చేశారు. నారా లోకేష్ వెంట నడిచేది ఎక్కువమంది యువత, ముఖాముఖి కూడా ఎక్కువగా యువతతోనే ఉండవచ్చని తెలుస్తోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, తెలుగుదేశం అధికారంలోకి వస్తే పరిష్కరించేందుకు హామీలు ఇవ్వనున్నారట. యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగనున్న లోకేశ్ పాదయాత్ర పేరు కూడా అదే లక్ష్యం ప్రతిబింబించేలా వుండవచ్చని ప్రచారం సాగుతోంది.

Tags:    
Advertisement

Similar News