నమ్మాల్సిందే.. తమిళనాడులో బీజేపీ తరపున లోకేష్ ప్రచారం

ఏపీలోనే లోకేష్ ని బీజేపీ నేతలు ప్రచారానికి పిలవట్లేదు, అలాంటిది తమిళనాడులో లోకేష్ ప్రచారానికి వెళ్తే ఉపయోగం ఉంటుందని అనుకోవడం వట్టి భ్రమ.

Advertisement
Update: 2024-04-11 14:43 GMT

ఏపీలో నారా లోకేష్ ప్రస్తుతం తాను పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గ ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో ఉపయోగం లేకపోగా, లోకేష్ తెరపైకి వస్తే నష్టం ఎక్కువ జరుగుతోందని భావించి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మీటింగ్ లకు కూడా లోకేష్ ని దూరం పెట్టారు. అలాంటి లోకేష్ ఇప్పుడు తమిళనాడులో బీజేపీ తరపున ప్రచారానికి వెళ్లడం కామెడీ కాక ఇంకేంటి. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. నారా లోకేష్ తమిళనాడులో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి బయలుదేరారు. కోయంబత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ తరపున లోకేష్ ప్రచారం చేస్తారు.

ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కట్టాయి. అంటే టీడీపీ, జనసేన ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నట్టే లెక్క. ఆ పొత్తు ధర్మం ప్రకారమే నారా లోకేష్, బీజేపీ అభ్యర్థుల ప్రచారం కోసం తమిళనాడు వెళ్లారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా లోకేష్ ప్రచారం చేస్తారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. పీలమేడు ప్రాంతంలో నేడు బహిరంగ సభ అనంతరం రేపు(శుక్రవారం) తమిళనాడులోని తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశం కాబోతున్నారు.

ఏపీలోనే లోకేష్ ని బీజేపీ నేతలు ప్రచారానికి పిలవట్లేదు, అలాంటిది తమిళనాడులో లోకేష్ ప్రచారానికి వెళ్తే ఉపయోగం ఉంటుందని అనుకోవడం వట్టి భ్రమ. కానీ కొడుక్కి ఎంతో కొంత బిల్డప్ ఇచ్చేందుకు చంద్రబాబు ఆయన్ను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంట గెలవలేని లోకేష్ ని రచ్చమీదకు పంపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News