ఎంపీగా పోటీ చేయడంపై నాగార్జున క్లారిటీ

రాజకీయాల్లోకి రావడం లేదు.. అవన్నీ పుకార్లే.. నాగార్జున క్లారిటీ

Advertisement
Update: 2022-09-30 14:27 GMT

Akkineni Nagarjuna

ఎన్నికలు దగ్గర పడ్డ ప్రతిసారి ఫలానా నటుడు ఫలానా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని.. ఫలానా నటి ఇంకో పార్టీ తరఫున పోటీ చేస్తోందని వార్తలు రావడం మామూలే. అలా టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున రాజకీయ ప్రవేశం చేస్తున్నాడని, విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలపై తాజాగా నాగార్జున స్పందించాడు.

తాను విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. శుక్రవారం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ..' నేను వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నాపై ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. మంచి కథ దొరికితే మాత్రం రాజకీయ నాయకుడిగా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను' అని పేర్కొన్నారు.

నాగార్జున మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించిన నాగార్జున.. ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్ తోనూ సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని.. పలుసార్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో 'ది ఘోస్ట్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News