పోలీసు పర్యవేక్షణలోనే పాదయాత్రా?

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తుంటే లోకేష్ పాదయాత్ర మొత్తం పోలీసుల పర్యవేక్షణలోనే సాగేట్లుంది. మామూలుగా అయితే పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఉల్లంఘలను ఎప్పుడు జరుగుతాయా అని చూసేందుకే పర్యవేక్షించేట్లున్నారు.

Advertisement
Update: 2023-01-25 05:48 GMT

పోలీసు పర్యవేక్షణలోనే పాదయాత్రా?

ఈనెల 27వ తేదీన కుప్పంలో మొదలవ్వబోయే లోకేష్ పాదయాత్రకు పోలీసుల పర్యవేక్షణ తప్పేట్లులేదు. పాదయాత్రకు పోలీసులు ముడు రోజులు అనుమతిచ్చారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగబోయే పాదయాత్రకు పోలీసులు మూడు రోజులు మాత్రమే అనుమతివ్వటం ఏమిటి? ఏమిటంటే బహుశా అంచలంచెలుగా అనుమతులు ఇవ్వాలని పోలీసులు అనుకున్నట్లున్నారు.


పాదయాత్ర సందర్భంగా లోకేష్ అనుసరించాల్సిన షరతులను కూడా విధించారు. వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి సమాచారం లేకుండానే పాదయాత్రను నిలిపేస్తామని కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇవ్వటం అన్నది టీడీపీ స్వయంకృతమనే చెప్పాలి. కందుకూరు, గుంటూరులో చంద్రబాబునాయుడు కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. పై రెండు ఘటనలకు పూర్తి బాధ్యత వహించాల్సిన చంద్రబాబు తప్పును పోలీసులు, ప్రభుత్వంపై నెట్టేశారు. 11 మందిని ప్రభుత్వం చేసిన హత్యలుగా వర్ణించటమే కాకుండా ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదచల్లించేశారు. తప్పులు చంద్రబాబులో పెట్టుకుని ఎదారు దాడి చేయటంతో మండిన ప్రభుత్వం రోడ్లపై సభలను నిషేధించింది.

దాని ప్రభావం ఇప్పుడు లోకేష్ పాదయాత్రపై పడింది. రోడ్డుషోల్లో సభలు పెట్టకూడదన్న పోలీసుల షరతును టీడీపీ ఎంతవరకు పాటిస్తుందో అనుమానమే. రోడ్డుషోల పేరుతో సభలు నిర్వహించటాన్ని ప్రభుత్వం నిషేధిస్తే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నది. అయితే ఈ కేసును విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేట్లుగానే ఉంది. నిజానికి పోలీసులు విధించిన షరతులు సాధారణమైనవే.

సభలు పెట్టకూడదని, మైకులో మాట్లాడొద్దని, బహిరంగసభ పెట్టుకోవాలంటే అనుమతి తీసుకోవాలని, యాత్రలో పాల్గొనేవాళ్ళ బాధ్యత నిర్వాహకులదేనని, గుర్తించేందుకు వీలుగా వలంటీర్లందరూ ఒకే యూనిఫారం వేసుకోవాలన్నారు. బహిరంగసభ ప్లేస్‌ను మార్చుకుంటే ఆ విషయాన్ని ముందుగా చెప్పాలని పోలీసులు చెప్పారు. ఇలాంటి నిబంధనలు విధించటంలో తప్పేమీలేదు. కానీ వీటిని మాత్రం ఎల్లో మీడియా టీడీపీకి వేధింపులన్నట్లుగా వర్ణిస్తోంది.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తుంటే లోకేష్ పాదయాత్ర మొత్తం పోలీసుల పర్యవేక్షణలోనే సాగేట్లుంది. మామూలుగా అయితే పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఉల్లంఘలను ఎప్పుడు జరుగుతాయా అని చూసేందుకే పర్యవేక్షించేట్లున్నారు.

Tags:    
Advertisement

Similar News