పవన్ కల్యాణ్ మంచి వ్యక్తి, కానీ..! -లక్ష్మీపార్వతి

పవన్ తాను సీఎం కాలేను అంటున్నారని, అలాంటప్పుడు పవన్ ని ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.

Advertisement
Update: 2023-06-07 15:22 GMT

ఇప్పటి వరకూ చంద్రబాబుని, లోకేష్ ని చెడామడా తిట్టి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పై సింపతీ చూపించేవారు నందమూరి లక్ష్మీపార్వతి. ఇప్పుడామె పవన్ కల్యాణ్ ని కూడా మెచ్చుకుంటున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా మంచి వ్యక్తి అని చెప్పారు. అయితే ఆయన చంద్రబాబు రాజకీయ ఉచ్చులో చిక్కుకున్నారని సింపతీ చూపించారు. అసలు పవన్, తాను సీఎం కాలేను అంటున్నారని, అలాంటప్పుడు పవన్ ని ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. టీడీపీతో జనసేన పొత్తుని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఆఖరికి పార్టీ సింబల్ ని కూడా జనసేన కోల్పోయిందన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇస్తేనే వారాహి ముందుకు కదులుతుందని, లేకపోతే హైదరాబాద్ షెడ్ లోనే ఉంటుందన్నారు.

అల్లుడు సుద్దులు అనే పుస్తకం రాశా..

ఏపిలో మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమంటున్న లక్ష్మీపార్వతి.. చంద్రబాబు పై 'అల్లుడు సుద్దులు' అనే పుస్తకం రాశానన్నారు. త్వరలో ఆ పుస్తకాన్ని విడుదల చేస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పడు లేదని, ఇప్పుడున్నదంతా అవినీతి టీడీపీ అని అన్నారు, అందుకే ఆ పార్టీని తాను వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు లక్ష్మీపార్వతి.

లోకేష్ ది ఈవెనింగ్ వాక్.. జూనియర్ కి టైమ్ ఉంది

నారా లోకేష్ ది పాదయాత్ర కాదని ఈవెనింగ్ వాక్ అని అన్నారు లక్ష్మీపార్వతి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బాగా రాణిస్తున్నారని, ఆయన రాజకీయాల్లోకి అప్పుడే రావాల్సిన అవసరం లేదని, కొంతకాలం సినీరంగంలోనే ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. చంద్రబాబు అక్రమాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు లక్ష్మీపార్వతి. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తికావడం ఖాయమన్నారు.

బీజేపీతో పొత్తు కష్టమే..

చంద్రబాబు, అమిత్ షా కలసినా పొత్తు గురించి ఇంకా ప్రకటన రాలేదంటే అది కష్టమేనంటున్నారు లక్ష్మీపార్వతి. తిరుపతిలో అమిత్ షా పై చంద్రబాబు రాళ్లు వేయించారని గుర్తు చేశారు. అలాంటి అవమానం చేసిన చంద్రబాబుని బీజేపీ మళ్లీ ఎలా దగ్గరకు తీస్తుందని ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News