పవన్ కల్యాణ్ ని ఇంటర్నేషనల్ యాక్టర్ ని చేస్తా

హాలీవుడ్ లో ఏంజెలినా జోలి, టామ్ క్రూజ్ సహా చాలామంది తనకు స్నేహితులని వారితో రికమండ్ చేసి పవన్ ని ఇంటర్నేషనల్ యాక్టర్ ని చేస్తానన్నారు కేఏ పాల్. తాను రియల్ హీరోగా ఉంటానని, పవన్ రీల్ హీరోగా కొనసాగాలన్నారు.

Advertisement
Update: 2023-08-29 13:52 GMT

కేఏ పాల్ మాటలు వింటుంటే.. పవన్ కల్యాణ్ మరీ అంత అమాయకుడిలా కనిపిస్తున్నారా అని అనిపించక మానదు. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పాల్, మరోసారి పవన్ కి ఆఫరిచ్చారు. తమ్ముడు పవన్ కల్యాణ్ అర్జంట్ గా జనసేనను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేసెయ్ అని చెప్పారు. తనతో కలిస్తే పవన్ భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో కూడా వివరించారు.

మనమే మనకు ముద్దు..

పవన్ కల్యాణ్ ఎన్ని తంటాలు పడినా ఏపీలో బీజేపీ గెలవదని, గత ఎన్నికల్లో కూడా ఆయన లెక్కకు మిక్కిలి పార్టీలతో కలిశారని అయినా 4 శాతం ఓట్లు కూడా రాలేదని గుర్తు చేశారు కేఏ పాల్. ఎవరూ మనకు వద్దు, మనమే మనకు ముద్దు అని పవన్ కి చెప్పారు. పవన్ తనతో చేయి కలిపితే ఆయన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ ని చేస్తానని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ లో ఏంజెలినా జోలి, టామ్ క్రూజ్ సహా చాలామంది తనకు స్నేహితులని వారితో రికమండ్ చేసి పవన్ ని ఇంటర్నేషనల్ యాక్టర్ ని చేస్తానన్నారు. తాను రియల్ హీరోగా ఉంటానని, పవన్ రీల్ హీరోగా కొనసాగాలన్నారు.

నేనుండగా స్టీల్ ప్లాంట్ అమ్మగలరా..?

తాను బతికుండగా స్టీల్ ప్లాంట్ ని ఎవరూ అమ్మలేరని తేల్చి చెప్పారు కేఏపాల్. నేనుండగా అసలు ప్లాంట్ ని ఎవరు కొంటారో చూస్తానన్నారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారని, ఇప్పుడు జనసేనను బీజేపీలో విలీనం చేస్తారనే వార్తలొస్తున్నాయని చెప్పారు. అసలు పవన్ కల్యాణ్ వారందర్నీ అడుక్కునే పరిస్థితి ఎందుకని, తన దగ్గరకు రావాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News