ఆ ముగ్గురినీ కేసీయార్ ఇరుకున పెట్టబోతున్నారా ?

భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కేసీఆర్ ఏపీ లో ఎంటర్ అవడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. మోడీతో సహా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడులను ఇరుకునపెట్టేందుకు అవసరమైన ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Update: 2022-10-06 07:32 GMT

ఏపీ జనాల మనసులను గెలుచుకోవటానికి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీయార్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారట. తొందరలో ఏపీలో నిర్వహించబోతున్న బహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును ఇరుకునపెట్టేందుకు అవసరమైన ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గడచిన ఎనిమిదన్నరేళ్ళుగా ఏపీ ప్రయోజనాలను నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. విభజన హామీలను అమలుచేయకుండా మోడీ ప్రభుత్వం తీరని నష్టంచేస్తోంది.

కేంద్రంవల్ల ఏపీకి ఎంతనష్టం జరుగుతున్నా అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్ నోరిప్పటంలేదు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు లాంటివన్నీ చివరకు రాజకీయంగా వివాదమైపోయాయి. ఈ నష్టాలు జరుగుతుండగానే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మోడీ సర్కార్ ప్రైవేటీకరణ చేసేస్తోంది. దీన్ని కూడా జగన్ అడ్డుకోలేకపోతున్నారు. సరిగ్గా ఈపాయింట్లనే కేసీయార్ ఆయుధాలుగా మార్చుకోబోతున్నట్లు సమాచారం.

మోడీకి వ్యతిరేకంగా జగన్, చంద్రబాబు మాట్లాడలేకపోతున్న అంశాలన్నింటిపైనా కేసీయార్ గొంతు వినిపించాలని అనుకున్నారట. ఏపీకి మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై జగన్, చంద్రబాబు గొంతువిప్పలేకపోతున్నారనే విషయం జనాల్లో అసంతృప్తిగా ఉంది. దాన్ని కేసీయార్ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఏపీ ప్రయోజనాల విషయంలో కేసీయార్ గొంతు విప్పబోతున్నారంటే ఏపీ మీద ప్రేమతో కాదు. కేవలం మోడీ ప్రభుత్వంతో పాటు జగన్, చంద్రబాబును ఇరుకునపెట్టడమే అసలు టార్గెట్.

ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కేసీయార్ ప్రశ్నిస్తే దాన్ని ఎవరూ తప్పుపట్టేందుకు లేదు. ఎందుకంటే అదంతా వాస్తవమే కాబట్టి. తమ రాజకీయ అవసరాల కోసం జగన్, చంద్రబాబు మాట్లాడలేకపోతున్న విషయం కూడా జనాలకు తెలుసు. కేంద్రం వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయం సరే మరి విభజన సమస్యల పరిష్కారానికి కేసీయార్ పూర్తి సానుకూలంగా లేరు కదా. పైగా ఏపీయే తెలంగాణాకు వేలకోట్ల రూపాయలు బకాయుందని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పట్లో తేలేవికావు. జనాలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారా లేదా అన్నది వేరే విషయం ముందైతే కేంద్రం, జగన్, చంద్రబాబును ఇరుకున పెట్టవచ్చు కదా.

Tags:    
Advertisement

Similar News